Site icon vidhaatha

భారత్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

భారత్‌లో ఎన్నో రకాలు వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో కొన్ని అధిక కేసులకు కారణం అవుతున్నాయి. కొన్ని తక్కువ కేసుల్లో ఉన్నాయి.

“డబుల్ మ్యూటెంట్‌గా పిలిచే ఈ వేరియంట్ మహారాష్ట్రలో 50-60 శాతం కేసులకు కారణమైంది. ఈ డబుల్ మ్యూటెంట్‌లో కాస్త తీవ్ర లక్షణాలున్నాయి. పంజాబ్‌లో యూకే వేరియంట్ ఉంది.

మహారాష్ట్ర వేరియంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కూడా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణల్లో 20 శాతం కేసులు అవే వస్తున్నాయి. బహుశా మిగతా వేరియంట్లు క్రమంగా పోయి అందరికీ ఇదే వస్తోందని అనుకుంటున్నాను” అని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.

“వేల మ్యుటేషన్లు, వేరియంట్లు వస్తాయి, పోతాయి. అవేవీ అంతగా వ్యాపించవు. కానీ, మనం వాటిని జాగ్రత్తగా గమనించక పోతే, ఏ వేరియంట్ అయినా కేసుల పెరుగుదలకు కారణం కావచ్చు” అన్నారు రాకేశ్ మిశ్రా.

Exit mobile version