Site icon vidhaatha

తమిళనాడు ఆర్థిక స్థితిపై త్వరలో శ్వేతపత్రం

విధాత‌:తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు.చెన్నైలోని సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…. విరాళాల వివరాలను పారదర్శకంగా ప్రకటించేందుకు వెబ్‌సైట్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. మే 7వ తేదీ తర్వాత వచ్చిన విరాళాలను వేరుగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేరళ తరహాలో వెబ్‌సైట్‌ను రూపొందించారని. మే 7వ తేదీ నుంచి గురువారం వరకు దాదాపు రూ.472 కోట్లు విరాళంగా వచ్చాయన్నారు.అన్నాడీఎంకే పాలనలో 14 నెలల్లో వచ్చిన మొత్తం రూ.400 కోట్లు అని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా సులభంగా విరాళం ఇవ్వడం, ఖర్చు చేసిన వివరాలను కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

పీఎం కేర్స్‌ నిధుల్లో పారదర్శకత లేదని .ఇప్పటివరకు రూ.241 కోట్లను కరోనా నియంత్రణ చర్యలకు ఖర్చు చేసినట్లు,రాష్ట్ర బడ్జెట్‌ దాఖలుకు ముందు ఆర్థిక స్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

Exit mobile version