జనం దృష్టిని అసలు సమస్య నుంచి పక్కకి మళ్లించి తన రాజకీయ లబ్ది పొందటానికి కేంద్రం చేస్తున్న కుట్రనా..?
విధాత:కరోనా మహమ్మారి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసింది. దేశ ప్రజలంతా అయినవాళ్ళని సన్నిహితులను కోల్పోయి పుట్టెడు దుఖంతో విలపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఎన్నికలకు, మత పరమైన వేడుకలకు అనుమతించటం వంటి వాటివల్ల ఈ దుస్థితి దాపురించింది.దీనికి తోడు వాక్సిను సరఫరా, పంపిణి మీద సరైన అవగాహనా కొరవటం కూడా ఒక కారణం.
ఆసుపత్రులన్నీ కోవిద్ రోగులతో క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. బెడ్లు కూడా దొరకని పరిస్థితి. ఆసుపత్రికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామన్న నమ్మకం కూడా లేదు ఇప్పుడు.
_NDRF చట్టాన్ని అమలు చేయటం ద్వారా రాష్ట్రప్రభుత్వాలు అధికారాలను నామమాత్రం చేసి మొత్తం ఆరోగ్య వైద్య వ్యవస్థ అంతటిని కేంద్రం తన హస్తగతం చేసుకుంది. మొత్తం అధికారాలన్నీ ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే వున్నాయి.
చీకట్లో చిరుదీపంలా కనిపిస్తున్న వాక్సిను కూడా ఇప్పుడు సరఫరా నిలిచిపోయింది.
ఎం చేయాలో తెలీటం లేదు. ఈ మహమ్మారినుంచి బయటపడే దారి కనపడక ప్రజలు చాల అయోమయంలో వున్నారు.కరోనా చీకట్లు కమ్ముకుని ప్రజలు అంధకారంలో వున్నారు. ఉపాధి కొరవడి ఆర్ధికంగా కూడా ప్రజలు విలవిల్లాడుతున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అసలైన వాస్తవాలను తెలియనివ్వకుండా మీడియా మీద నియంత్రణ విధించింది. పత్రికల్లో, టీవీల్లో నెగటివ్ వార్తలు రాకుండా కేంద్రం కట్టుదిట్టం చేసింది.
మరోపక్క కొత్తగా డిజిటల్ నిబంధనలను తెరమీదకు తెచ్చింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటల్ మాద్యమాల మధ్య తగాదాలు సృష్టించి జనాలను పూర్తిగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది.ఇదంతా కూడా జనల దృష్టిని అసలు సమస్య నుంచి పక్కకి మళ్లించి తన రాజకీయ లబ్ది పొందటానికి కేంద్రం చేస్తున్న కుట్ర.
దేశంలో చాలామంది డిజిటల్, సోషల్ మాధ్యమాలకు బాగా అలవాటు పడి ఉండటం కూడా కేంద్రానికి కలిసివచ్చిన అంశం. ఎప్పుడు ఎదో ఒక తగాదా తెరమీద ఉండేలా చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తోంది.దీంతో అసలు సమస్యని మరుగున పడేలా చేసి రాజకీయ ప్రయోజనాలను పొందటమే కేంద్రం లక్ష్యం.