Site icon vidhaatha

పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర మరింత కీలకం. తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే. కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయం.

పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్వీట్ చేశారు.

Exit mobile version