లూనా మాత్ అందమైన ఆకుపచ్చ రెక్కలతో కనిపిస్తుంది. ఈ కీటకం పెద్దదయ్యాక ఒక వారం మాత్రమే జీవిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే,  ఈ దశలో వీటికి పనిచేసే నోరు ఉండదు. అంటే ఇవి ఆహారం తీసుకోలేవు. అందువల్ల వాటి మొత్తం జీవితకాలం సంభోగం చేసి తమ జాతిని కొనసాగించడానికే అంకితం అవుతుంది.

ఈ ఈగ జాతి జీవులు సాధారణంగా 15 నుంచి 30 రోజులు జీవిస్తాయి. ఈ తక్కువ సమయంలోనే అవి వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. మానవ నివాస ప్రాంతాలకు సులభంగా అలవాటు పడతాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవి విస్తృతంగా కనిపిస్తాయి

దోమలు కూడా తక్కువ జీవితకాలం కలిగిన కీటకాలు. మగ దోమలు సాధారణంగా ఒక వారం వరకు మాత్రమే జీవిస్తాయి. అయితే ఆడ దోమలు పర్యావరణ పరిస్థితులను బట్టి కొన్ని వారాల వరకు జీవించగలవు. వీటి జీవితకాలం తక్కువ అయినప్పటికీ, దోమలు పర్యావరణ వ్యవస్థలో పాత్ర పోషిస్తాయి

ఫ్రూట్ ఫ్లైలు వేగవంతమైన జీవిత చక్రం కారణంగా శాస్త్రీయ పరిశోధనలో చాలా ప్రాముఖ్యం పొందాయి. ఇవి సాధారణంగా 40 నుంచి 50 రోజుల వరకు జీవిస్తాయి. ఇవి త్వరగా పునరుత్పత్తి చేయడంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతాయి.

డ్రోన్ యాంట్స్‌ అనేవి మగ చీమలు. వీటి ప్రధాన లక్ష్యం పునరుత్పత్తి. ఇవి సాధారణంగా నుప్టియల్ ఫ్లైట్స్‌ అనే ప్రత్యేక సంభోగ సమయంలో పాల్గొంటాయి. రాణి చీమతో సంభోగం చేసిన తర్వాత డ్రోన్ యాంట్స్‌ సాధారణంగా కొద్ది కాలంలోనే చనిపోతాయి. అంటే వీటి జీవితం మొత్తం ప్రధానంగా పునరుత్పత్తికే పరిమితం అవుతుంది.

తేనెటీగలు పరాగసంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే తేనెటీగల గూడును నిర్వహించడంలో కూడా ముఖ్యమైన బాధ్యత వహిస్తాయి. వర్కర్ బీస్‌ సాధారణంగా 5 నుంచి 6 వారాల వరకు మాత్రమే జీవిస్తాయి. ఈ సమయంలో అవి తేనె సేకరించడం, తేనె తయారు చేయడం, గూడును రక్షించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటాయి.

గ్యాస్ట్రోట్రిచ్‌లు సాధారణంగా మంచినీటిలో కనిపించే సూక్ష్మ జల జీవులు . ఇవి పరిమాణంలో చాలా చిన్నవైనా, జల పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటి జీవితకాలం సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే ఇవి చాలా వేగంగా పునరుత్పత్తి చేస్తాయి.

అతి తక్కువ కాలం జీవించే కీటకాల్లో మేఫ్లై ఒకటి. పెద్ద మేఫ్లైలు సాధారణంగా కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు మాత్రమే జీవిస్తాయి. ఈ తక్కువ సమయంలో వాటి ప్రధాన లక్ష్యం పునరుత్పత్తి చేయడం. సంభోగం చేసి గుడ్లు పెట్టిన తర్వాత వీటి జీవన చక్రం త్వరగా ముగుస్తుంది