భారత క్రికెట్ జట్టు దాదాపు నలభై సంవత్సరాలుగా బ్లూ కలర్ జెర్సీతోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతోంది. వన్‌డే, టీ20 ఫార్మాట్‌లలో భారత ఆటగాళ్లను తరచుగా “మెన్ ఇన్ బ్లూ” అని కూడా పిలుస్తారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రతి జట్టు తమకు ప్రత్యేక గుర్తింపుగా ఒక రంగును ఎంచుకుంటుంది.

భారత జట్టు బ్లూ కలర్‌ను ప్రధానంగా ఉపయోగిస్తుండగా, కొన్ని ఇతర దేశాలు కూడా బ్లూ కలర్ జెర్సీలను వాడుతున్నాయి. అయితే వాటి షేడ్లు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒకే రంగుకు దగ్గరగా ఉన్న జట్లు పరస్పరం మ్యాచ్ ఆడే సందర్భంలో ప్రత్యామ్నాయ జెర్సీ ధరించాల్సి వస్తుంది.

క్రికెట్‌లో మూడు ప్రధాన ఫార్మాట్‌లు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లు, 50 ఓవర్ల వన్‌డే మ్యాచ్‌లు , 20 ఓవర్ల టీ20 మ్యాచ్‌లు. టెస్ట్ క్రికెట్‌లో అన్ని జట్లు తెలుపు రంగు దుస్తులు ధరిస్తాయి. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో మాత్రం రంగురంగుల జెర్సీలు వాడటం ఆనవాయితీగా మారింది.

ఈ రంగు జెర్సీల ఆలోచన తొలిసారిగా మీడియా వ్యాపారవేత్త కెరీ ప్యాకర్ ప్రారంభించిన వరల్డ్ సిరీస్ క్రికెట్ కాలంలో బాగా ఫేమస్ అయింది. టెలివిజన్ ప్రసారాల్లో ఆటను ఆకర్షణీయంగా చూపించడానికి రంగురంగుల దుస్తులు ప్రవేశపెట్టారు.

భారత జట్టు బ్లూ కలర్ ఎంపిక వెనుక కూడా ప్రత్యేక కారణం ఉంది. భారత త్రివర్ణ పతాకంలో మధ్యలో ఉన్న అశోకచక్రం బ్లూ కలర్‌లో ఉంటుంది. అదే రంగు జాతీయ ఏకత్వానికి ప్రతీకగా భావిస్తాం. ఆ భావనతోనే భారత జట్టు జెర్సీకి బ్లూ కలర్ ఎంపిక చేశారు. 

1985లో జరిగిన ‘బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్’ టోర్నీలో భారత జట్టు తొలిసారిగా బ్లూ కలర్ జెర్సీ ధరించింది. ఆ సమయంలో జెర్సీ బ్లూ కలర్‌లో ఉండి, ఎల్లో లైన్స్‌ ఉండేలా డిజైన్ చేశారు.

తర్వాత 1992 వరల్డ్‌కప్ సమయంలో కలర్స్‌తో ఉండే జెర్సీల వాడకం అధికారికంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి భారత జట్టు ఫుల్ బ్లూ కలర్ జెర్సీతో ఆడడం ప్రారంభించింది. ఈ మార్పు తర్వాతే ఆటగాళ్లను “మెన్ ఇన్ బ్లూ” అని పిలవడం మెుదలు పెట్టారు.

బ్లూ కలర్ ఆకాశం, సముద్రం వంటి విశాలతను సూచిస్తుందని, జట్టులో ఉన్న అపార సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని కూడా భావిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో జెర్సీల రంగులపై కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.

ప్రతి దేశ క్రికెట్ బోర్డు తమ జట్టు గుర్తింపు, సంస్కృతి లేదా జాతీయ చిహ్నాల ఆధారంగా ప్రధాన రంగును నిర్ణయిస్తుంది. అయితే అంతర్జాతీయ టోర్నీల్లో రెండు జట్ల జెర్సీలు ఒకే రంగుకు దగ్గరగా ఉంటే, ఒక జట్టు ప్రత్యామ్నాయ జెర్సీ ధరించాలి.

అంతర్జాతీయ క్రికెట్‌లో జెర్సీల రంగులపై కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ప్రతి దేశ క్రికెట్ బోర్డు తమ జట్టు గుర్తింపు, సంస్కృతి లేదా జాతీయ చిహ్నాల ఆధారంగా ప్రధాన రంగును నిర్ణయిస్తుంది. అయితే అంతర్జాతీయ టోర్నీల్లో రెండు జట్ల జెర్సీలు ఒకే రంగుకు దగ్గరగా ఉంటే, ఒక జట్టు ప్రత్యామ్నాయ జెర్సీ ధరించాలి.