భారతదేశంలో లీటరు పెట్రోల్ రూ.100 కంటే ఎక్కువ ధరే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో లీటర్ రూ.110 దాకా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. దేశంలోనే అత్యధిక ధర ఏపీలో ఉంటుంది.

అలాంటిది.. ఒక దేశంలో పెట్రోల్ లీటర్ 2 రూపాయలకే లభిస్తోంది. ఇది నమ్మశక్యం కాదు. కానీ నిజం. డాలర్లలో చెప్పాలంటే.. ఆ దేశంలో లీటరు పెట్రోల్ $0.02 మాత్రమే. 

ఆ దేశం పేరే వెనెజులా. ప్రస్తుతం ఈ దేశంపై ఆమెరికా కన్ను ఉంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న ఈ దేశంలో చమురు మొత్తం తోడేసేందుకు అమెరికా రెడీగా ఉంది.

ట్రంప్.. తమ దేశ కంపెనీలను వెనెజులాకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. వెనెజులాలో చమురు ఎక్కువ.. జనాభా తక్కువ. అందువల్ల అక్కడ పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉంది.

ఈ చమురు నిల్వలు ఆ దేశానికి పెద్ద ఆస్తిగా ఉన్నాయి. అభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశం.. ఈ చమురును అమ్ముకోవడం ద్వారా.. సంపన్న దేశంగా మారగలదు.

కానీ.. పాలకులు.. ఆ చమురును తమ దేశ ప్రజలకే ఎక్కువగా వాడాలని భావిస్తున్నారు. ఇది ట్రంప్‌కి నచ్చట్లేదు. ప్రస్తుతం వెనెజులాలో దాదాపు 303 కోట్ల బ్యారెళ్ల చమురు ఉంది.

దీని మార్కెట్ విలువ దాదాపు $17.3 ట్రిలియన్లు. అంటే భారత కరెన్సీలో రూ.1,400 లక్షల కోట్లు.