ఏ దేశంలో వెండి ఎక్కువగా లభిస్తోంది. ఆ దేశంలో ఎందుకంత ధరలు తక్కువ. భారత్‌లో వెండి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి.
వెండి చరిత్రలో మొదటిసారి కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటింది. బంగారంతో పాటు వెండి కూడా సాపేక్షంగా పెరుగుతోంది. అయితే ఈ దేశాల్లో మాత్రం వెండి చాలా చౌకగా దొరుకుతుంది.
మరి ఆ దేశమేంటో తెలుసుకుందామా? అక్కడే ఎందుకంత ధరలు తక్కువ. మరి ఇంకే దేశంలో వెండి ధరలు ఎలా ఉన్నాయి వంటి విషయాలను తెలుసుకుందాం?
మెక్సికో వెండి ఉత్పత్తిలో ఎందుకు ముందుందో తెలుసా మెక్సికోలో జకాటెకాస్, గువానాహువాటో, సోనోరా, డురాంగో వంటి ప్రాంతాల్లో శతాబ్దాల చరిత్ర గల వెండి గనులు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఈ ప్రాంతాలు శతాబ్దాల క్రితమే స్పానిష్ పాలన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి నేలలో వెండి సహజంగా ఎక్కువగా లభించడంతో పాటు ప్రపంచ స్థాయి మైనింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.
ఆధునిక సాంకేతికత, అనుభవం ఉన్న కార్మికులు, పాతకాలం నాటి సంప్రదాయ మైనింగ్ విధానాలు ఈ మూడు కలిసి మెక్సికోను వెండి ఉత్పత్తుల రాజ్యంగా మార్చేసింది.
పంచ వెండి రాజధాని మెక్సికోలోని టాక్సో అనే చిన్న నగరం సిల్వర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్‌గా ప్రసిద్ధి చెందింది. మెక్సికోలో వెండి కేజీ రూ.25 వేలు మాత్రమే ఉంది.