పూర్వం ఇంట్లో ఆడపిల్ల యుక్తవయస్సుకు వచ్చిందంటే రజస్వల అయితే గుర్తించే వారు. అంటే 13-14ఏళ్ల వయసులో అమ్మాయిలు రజస్వల అయ్యేవారు. కాని ఇప్పుడు పిల్లలు తినే తిండి, స్ట్రెస్, పేరెంట్స్ జీన్స్ వల్ల 10 సంవత్సరాల లోపు బాలికలు రజస్వల అవుతున్న పరిస్థితులు ఉన్నాయి
చిన్న వయసులో రజస్వల అయితే ఆరోగ్యపరంగా పలు సమస్యలకు దారి తీసే అవకాశముందని డాక్టర్స్ చెప్తున్నారు. సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాల మధ్య రజస్వల కావడం సాధారణ ప్రక్రియ. అయితే 10 ఏళ్లకు ముందే రజస్వల అయితే దాన్ని “ఎర్లీ మీనార్కి”గా పరిగణిస్తామని చెప్పారు.