మఖానా- ఈ మఖానాను ప్రధాని మోదీ సూపర్ స్నాక్‌గా అభివర్ణించారు. మఖానా తక్కువ క్యాలరీలతో పాటు మంచి ప్రోటీన్‌ను అందిస్తుంది. అలాగే కిడ్నీలు, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

కాల్షియం పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. ముఖ్యంగా ఈ మఖానా సాగు ఎక్కువగా బిహార్‌లో ఉంటుంది. ఇది అక్కడి వారి ప్రధాన జీవనాధార పంటల్లో ఒకటి. దీని వినియోగం వల్ల రైతులకు జీవనాధారంగా మారుతోంది.

రాగి, జొన్న, సజ్జ వంటి ధాన్యాలు వేల సంవత్సరాలుగా మన దేశంలో పుష్కలంగా పండుతున్నాయి. శ్రీ అన్న అనే పిలవబడే మిల్లెట్లు పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉంటాయి. తక్కువ నీటితో పండే గుణం కలిగి ఉంటాయి.

ఖిచ్డీ - అనారోగ్య సమయంలో ఇది శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. బియ్యం, పప్పు, మసాలాలతో తయారయ్యే ఈ వంటకం కార్పోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్ వంటివి సమతుల్యంగా అందిస్తుంది. జీర్ణశక్తిని మెరుగు పర్చేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది.

డ్రమ్ స్టిక్ - ఇది డ్రమ్ స్టిక్ ఆకులతో చేసే పరాటాలు కూడా ఆయన ఇష్టపడే వంటకం. మునగ ఆకుల్లో ఇనుము, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే తల్లులు, పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

బ్లాక్ రైస్ - బ్లాక్ రైస్‌పై కూడా ప్రధాని మోదీ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. మణిపూర్, ఒడిశాలో పండే ఈ బియ్యం జీర్ణక్రియకు ఎంతో సహాయకపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఇది ఉపయుక్తంగా పని చేస్తుంది

భాక్రి దాల్ - ఇది జొన్న లేదా సజ్జతో చేసే భాక్రి, పప్పుతో కలిపి తింటే మంచి ప్రోటీన్, ఇనుము ఉంటుంది. ఇవి శరీరానికి మంచిగా అందుతాయి. అలాగే సీజనల్ కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది.

ధోక్లా: ఇది పులియబెట్టి, ఆవిరి మీద ఉడికించిన పదార్థం. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది. వేయించిన స్నాక్స్ అంటే ఇవి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మద్దతు ఇస్తుంది.

శ్రీఖండ్: సాంప్రదాయకంగా వడకట్టిన పెరుగు వంటకం, ఇది ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ప్రోటీన్లను అందిస్తుంది. ఇది చక్కెర అధికంగా ఉండే కృత్రిమ డెజర్ట్‌లకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం.

సేవ్ టమాట - సేవ్ టమోట వంటి సంప్రదాయ వంటకాలు కూడా పోషకాహారంతో పాటు రుచిని అందిస్తాయి. ఈ విధంగా భారతీయ సంప్రదాయ ఆహారం ఆరోగ్యానికి, రైతులకు, సంస్కృతికి ఎంతో మేలు చేస్తుందని మోదీ వీటిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.