ఆయన విజయనగరానికే రాజు. రాజకీయాల్లో లెజండ్రీ లీడర్. ప్రజాసేవ చేయడంలో రియల్ హీరో. వెయ్యి కోట్ల విలువైన భూదానం చేసిన ప్రజాసంక్షేమసారధి.

తెలుగు రాష్ట్రాలకు అత్యంత సుపరిచమైన నాయకుడు, ఒకప్పటి ప్రజాప్రతినిధి, ప్రస్తుతం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. క్షత్రియ వంశంలో పుట్టిన ఈ టీడీపీ నేత గత నాలుగు దశాబ్ధాలకుపైగా ఒకే పార్టీని నమ్ముకొని..

ఉత్తరాంధ్ర ప్రజల ఆదరాభిమానాలతో రియల్ లైఫ్‌లో కూడా మహరాజుగానే కీర్తించబడుతున్నారు పూసపాటి అశోక్ గజపతిరాజు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అనే మాట అబద్దమని

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అనే మాట అబద్దమని అశోక్ గజపతిరాజు మరోసారి నిరూపించారు.

పదవులు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆయన తమ పూర్వికుల నుండి సంక్రమించిన వేల కోట్ల ఆస్తులను దానం చేయడమే కాకుండా..

తమకున్న యావదాస్తిలో వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే 136 ఎకరాల భూమిని ఏవియేషన్ ఎడ్యూసిటీకి దానం చేసి ఆయన గొప్ప గుణాన్ని మరోసారి చాటుకున్నారు.

నిఖార్సైన రాజకీయ నేతగా, అవినీతి, అక్రమార్జన మకిలి అంటుకోని ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందారు.