అక్కడే ఉన్న చైనీస్ కాళీ ఆలయం భక్తి సంప్రదాయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తోంది. చైనా కాళీ బారి అని కూడా పిలిచే ఈ ఆలయం సాధారణ ఆలయాలకంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అందించే ప్రసాదం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది
సాధారణంగా ఆలయాల్లో పండ్లు లేదా మిఠాయిలు ప్రసాదంగా ఇస్తారు. అయితే ఈ ఆలయంలో నూడిల్స్, మొమోస్, పిజ్జా వంటి వంటకాలను దేవికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందిస్తారు. ఈ ప్రత్యేకత కారణంగా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు.