Vidhaatha

Latest Telugu News

Menu Icon

ప్రధాని మోదీకీ లేనన్ని కార్యాలయాలు.. రేవంత్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులపై ఆసక్తికర చర్చ

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి.. ప్రగతిభవన్‌ గడీలో ఉంటూ పాలిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒకప్పుడు కేసీఆర్‌పై దుమ్మెత్తిన రేవంత్‌ రెడ్డి.. సచివాలయంలోని చాంబర్‌ సహా మొత్తం ఐదు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విధాత ప్రత్యేకం

సైబరాబాద్ సామాన్యులకు నిషిద్ధం! 100% కాంక్రీట్, పార్కులు లేవు, పచ్చదనం లేదు

సైబరాబాద్ సంపన్నులకు మాత్రమే రిజర్వు చేయబడుతున్నది. ధరల రిగ్గింగు అడ్డూ అదుపు లేకుండా జరిగిపోతున్నది. సైబరాబాద్ రిచ్ అండ్ ఫేమస్ వర్గాల నగరంగా రూపాంతరం చెందుతున్నది. ప్రభుత్వ భూములన్నీ హరించుకుపోతున్నాయి. ఒకప్పుడు ఎకరా స్థలంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగేది. ఇప్పుడు ఎనిమిది లక్షలు, పది లక్షలు చదరపు అడుగులు కడుతున్నారు. అయినా ధరలు మాత్రం ధనిక వర్గాలు మాత్రమే కొనగలిగే విధంగా పెడుతున్నారు.

అభిప్రాయం

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

పాఠశాలకు వచ్చిన మొసలి..విద్యార్థులు లేక తప్పిన ప్రమాదం!

పాఠశాలకు వచ్చిన మొసలి..విద్యార్థులు లేక తప్పిన ప్రమాదం!

గుజరాత్‌లోని ఓ పాఠశాల ఆవరణలోకి 10 అడుగుల భారీ మొసలి ప్రవేశించడం కలకలం రేపింది. విద్యార్థులు లేని సమయంలో ఘటన జరగడంతో ప్రమాదం తప్పగా, అధికారులు మొసలిని సురక్షితంగా తరలించారు.

ముంబై మెట్రో స్టేషన్ లో రస్సైల్ వైపర్ పాము కలకలం

ముంబై మెట్రో స్టేషన్ లో రస్సైల్ వైపర్ పాము కలకలం

ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పాము కనిపించడం కలకలం రేపింది. అటవీ శాఖ సిబ్బంది దానిని సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

సహజీవనం తప్పు అన్నందుకు కుటుంబాన్నే లేపేసిన కూతురు!

సహజీవనం తప్పు అన్నందుకు కుటుంబాన్నే లేపేసిన కూతురు!

సహజీవనాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు, చెల్లిపై యువతి తన ప్రియుడితో కలిసి కత్తితో దాడి చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ముగ్గురు మృతి చెందగా నిందితులు పరారీలో ఉన్నారు.

ఆ బిజినెస్ మ్యాన్ ను కాబోయే భార్యే ఖతం చేసింది..!

ఆ బిజినెస్ మ్యాన్ ను కాబోయే భార్యే ఖతం చేసింది..!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పూణే గహుంజేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మరణం వెనుక మిస్టరీ వీడిపోయింది. కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ తో కలిసి పక్కా పథకంలో అతడిని కోటపై నుంచి లోయలోకి తోసివేసి చంపినట్లుగా పోలీసు విచారణలో వెల్లడైంది.

గూగుల్​ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్‌ యాప్​ ప్రత్యక్షం.. నీట్‌ వివాదంతో విధించిన నిషేధం ముగింపు

గూగుల్​ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్‌ యాప్​ ప్రత్యక్షం.. నీట్‌ వివాదంతో విధించిన నిషేధం ముగింపు

నీట్‌ పరీక్ష పేపర్ల లీక్‌, తప్పుడు సమాచారంపై ఆందోళనల నేపథ్యంలో విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో సోషల్ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్‌ ​ మళ్లీ గూగుల్‌ ప్లే స్టోర్‌లో కనిపించింది. అయితే యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.

సైబర్‌ నేరగాళ్ల QR చెల్లింపులకు వ్యాపారులు బలి.. ఖాతాలు ఫ్రీజ్‌

సైబర్‌ నేరగాళ్ల QR చెల్లింపులకు వ్యాపారులు బలి.. ఖాతాలు ఫ్రీజ్‌

సైబర్‌ నేరగాళ్లు మోసపు డబ్బుతో QR కోడ్‌ ద్వారా షాపింగ్‌ చేస్తుండటంతో వ్యాపారులు చిక్కుల్లో పడుతున్నారు. డబ్బు ఎటు వెళ్లిందనే విచారణలో భాగంగా పోలీసులు అసలేమీ తెలియని వ్యాపారుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారు.