Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారు శుభవార్త వింటారు!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బీఆర్ఎస్‌లో తగ్గని ‘బీటీ బ్యాచ్’ హవా! వాళ్లకే ఇన్‌చార్జ్‌ పగ్గాలు

ప్రతిపక్ష బీఆరెస్‌లో మరోసారి బీటీ బ్యాచ్‌ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు పార్టీల్లో ఉన్నవారు బీఆరెస్‌ గూటికి చేరారు. అక్కడితో ఆగకుండా.. ఉద్యమకాలం నాటి నేతలను మించిన ప్రయారిటీ దక్కించుకున్నారు. దీంతో అప్పటి నుంచే వారి వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని పునర్నిర్మించుకునే పనిలో చేపట్టిన సభ్యత్వాలు, ఇతర కార్యక్రమాలకు సైతం ఎక్కువ మంది బీటీ బ్యాచ్‌ నేతలను ఎంపిక చేయడం బీఆరెస్‌ శ్రేణుల్లో విమర్శలకు తావిస్తున్నది.

KTR Meets KCR at Erravalli farm house

ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా... బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!

ఇది బహుశా పొలిటికల్‌ ఆఫర్లలోనే గ్రేటెస్ట్‌ ఆఫర్‌ అవ్వడం ఖాయం. ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో, పాత్రికేయుల్లో జరుగుతున్న చర్చలు, వినిపిస్తున్న వాదనల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తున్నది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. తమ కుటుంబానికి ఐదు సీట్లు ఇస్తే.. ప్రతిఫలంగా పార్టీ ఫండ్‌ కింద వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేశారట!

political buzz in delhi circles about 1000 crore offer from a ex minister - image generated with AI help

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరిన కొన్నాళ్లకే విషాదం

Telugu Techie | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి.. సాఫ్ట్‌వేర్ జాబ్ పొందిన కొద్దిరోజులకే కన్నుమూసింది. ఏపీకి చెందిన లోకేశ్వరి పిట్టు (28) లుకేమియా (బ్లడ్ క్యాన్సర్‌)తో పోరాడుతూ ప్రాణాలు విడిచింది.

భగీరథ్​ పోక్సో కేసులో కొత్త మలుపు : బాధితురాలి వయసుపై గందరగోళం

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాధిత యువతికి సంబంధించి రెండు వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు బయటపడటంతో అసలు వయస్సుపై వివాదం నెలకొంది. స్కూల్ రికార్డులు, 2021 చార్జ్‌షీట్, ఇతర ప్రభుత్వ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Bandi Bhageerath during an event amid ongoing POCSO case controversy

కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!

Apple Farming | ఆపిల్ పండ్లు అంటే చల్లటి ప్రాంతాల్లోనే కాస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన కాకాసాహెబ్ సావంత్ అనే రైతు కరువు నేలలో వేడి వాతావరణంలో కూడా ఆపిల్ పంట సాగు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు..

I Bomma | తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వణికించిన పైరసీ వెబ్‌సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి నిర్మాతలకు భారీ నష్టాలు కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.