ఒకవైపు కేరళలో అధిష్ఠానం తన అభిప్రాయాన్ని పక్కనపెట్టి.. పార్టీ నేతల అభీష్టానికి విలువనిచ్చి.. సతీశన్‌ను సీఎం చేసింది. తదుపరి కర్ణాటకలో సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేసింది. మరి తెలంగాణకూ ఈ రాజకీయ రుతుపవనం తాకుతుందా? 2034 వరకూ నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలున్న ప్రతివేదికపైనా బలంగా బల్లగుద్దుతున్నారు. దీని వెనుక ప్లాన్ బీ ఏమైనా ఉన్నదా?
విధాత ప్రత్యేకం
దేశంలో దొంగలు పడ్డారు అనేది పాత సామెత. కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ‘బ్యాంకుల్లో గజదొంగలు పడ్డారు’ అనేది కొత్త స్లోగన్‌గా మారిపోయిందనే పరిస్థితి నెలకొన్నది. గడిచిన 11 ఏళ్లలో గుప్పెడు మంది కార్పొరేట్ బడాబాబులకు ఏకంగా 9.75 లక్షల కోట్ల రూపాయల రుణాలు రైటాఫ్ చేశారంటే.. వారి పట్ల ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉన్నదో అర్థమవుతున్నది. దీనిపై విధాత వరుస కథనాలు. ది గ్రేట్ ఇండియన్ బ్యాంక్ రాబరీ పార్ట్ 1 చదవండి..
విధాత ప్రత్యేకం
నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్లో జోప్ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.
విధాత ప్రత్యేకం
మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న వరంగల్ కాంగ్రెస్‌లోని వైరి వర్గాలు ఆత్మీయ సమావేశం పేరిట ముచ్చట్లాడుకుని.. కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు కలిశారా? అధిష్ఠానం వార్నింగ్‌తో సమావేశమయ్యారా? లేక ఇలానే తిట్టుకుంటూ అభివృద్ధిని విస్మరిస్తే జనం ఓడిస్తారని భయపడ్డారా? కారణం ఏదైనా.. పార్టీ కింది స్థాయి క్యాడర్లో మాత్రం ఈ పరిణామం సానుకూలతను కలిగిస్తున్నది.
విధాత ప్రత్యేకం