Site icon vidhaatha

ANDRAPRDESH | శివుడికి నిజ నాగాభరణం శ్రీశైలంలో అద్భుతం

విధాత : శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి పుణ్య క్షేత్రంలో అద్భుతం చోటుచేసుకుంది. పాతాళ గంగ వద్ద నాగుపాము చంద్రలింగాన్ని చుట్టుకొని ఉండటం కనిపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీశైలంలో పాతాళ గంగ వద్ద చంద్ర లింగేశ్వర స్వామి ప్రాచీన ఆలయం ఉంది. అక్కడ ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కూడా ఆలయ ప్రాంగాణాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం ఓ పెద్ద నాగుపాము అక్కడికి వచ్చి చంద్ర లింగాన్ని చుట్టుకొని పడగవిప్పి కనిపించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు శ్రీశైల భక్తులు ఎగబడ్డారు. తరుచు పాములు ఆలయ పరిసరాల్లో తిరుగుతుంటాయని, అయితే ఇలా ఎప్పుడు జరగలేదని భక్తులు చెబుతున్నారు.

Exit mobile version