Site icon vidhaatha

Viral: నటించే.. ఇలాంటి టక్కరి పామును మీరెప్పుడైనా చూశారా..!

Viral |

విధాత: ప్రకృతిలో కోటానుకోట్ల జీవరాశిలో పాములు కూడా రకరకాల జాతులున్న సంగతి తెలిసిందే. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా పాములందు ఈ పాము జాతి వేరయా అన్నట్లుగా ఉంది ఈ టక్కరి పాము కథ. నటనలో మేటిగా.. భయంతో పరుగెత్తడంలో మిన్నగా మనుగడ సాగిస్తున్న ఓ పామును చూస్తే..విస్మయం కల్గకమానదు. ఇందుకు సంబంధించిన పాము వీడియో వైరల్ గా మారింది.

మట్టి రోడ్డున పాకుతూ వెలుతున్న పాము ఆకస్మాత్తుగా చచ్చినట్లుగా పడుకుండి పోయింది. అది ఎందుకు అలా చేసిందో కాని..ఆ సమయంలో దానిని చూస్తే అది ఖచ్చితంగా చచ్చిన పాము అనుకుంటారు. అంతలోనే ఆ మహానటి పాము మెరుపు వేగంతో ఉన్న స్థానం నుంచి సర్రున వాయవేగంతో పరుగు తీసింది. ఆ పాము పరుగు స్పీడ్ చూస్తే బహుశా ఇదే అత్యంత వేగంగా పరుగెత్తే పాము కాబోలు అనుకోవచ్చు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ప్రపంచంలో ఇలాంటి పాము ఇంతకు ముందెన్నడు చూడలేదని..నెవర్ బీఫోర్ ఎవర్ అఫ్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత నటించే..మోసపూరిత ఎత్తుగడలతో బతికే పామును ఇంతకుముందెన్నడు చూడలేదని మరికొంందరు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ పాము ఆకాశ మార్గంలో గద్దలను చూసినప్పుడు అలా చచ్చినట్లుగా నటిస్తుందని..లేకపోతే తన ఆహారంగా ఉండే క్రిమికీటకాలు తన సమీపానికి వచ్చేలా చచ్చినట్లు నిద్ర నటించి అవి దగ్గరకు రాగానే ఒక్క ఉదుటున వాటిని మింగేందుకు అలా చేస్తూ ఉంటుందంటున్నారు సరిసృపాల నిపుణులు

Exit mobile version