CM Chandrababu Naidu | అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు. గ్రామంలోని ఉల్సాల అలివేలమ్మ ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను అందించిన చంద్రబాబు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో చేనేత మగ్గాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.
అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు జగదీష్ ఆటోలో ప్రజా వేదిక సభ వేదిక వద్ధకు వెళ్లారు. ఈ సందర్బంగా జగదీష్ తో ఆటో డ్రైవర్ల సమస్యలపై చంద్రబాబు ఆరాతీశారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. జమ్మల మడుగు మండలం పర్యటన లో భాగంగా గండి కోటలో వ్యూ పాయింట్ పరిశీలించారు. స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ డెవలపర్స్ సమావేశంలో పాల్గొన్నారు.