Virosh | సంగీత్ పిక్స్ షేర్ చేసిన విజ‌య్‌-ర‌ష్మిక జంట‌.. క్యూట్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టేశారుగా..!

Virosh | టాలీవుడ్ స్టార్ క‌పుల్ విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Virosh | టాలీవుడ్ స్టార్ క‌పుల్ విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు, కొడవ సాంప్రదాయాల్లో ఒకేరోజున రెండుసార్లు పెళ్లి జరగడం ప్రత్యేకతగా నిలిచింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఈ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌పై దృష్టి సారించింది. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి అతిథులు హాజరవుతారని సమాచారం. దీంతో ఈ ఈవెంట్ హైప్రొఫైల్ కార్యక్రమంగా మారింది. పెళ్లి త‌ర్వాత ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట తాజాగా తమ సంగీత్ ఫోటోలు షేర్ చేసారు. సంగీత్ లో ఈ ఇద్దరూ కలిసి క్యూట్ గా డ్యాన్స్ వేసినట్టు ఈ ఫొటోలతో తెలుస్తుంది. దీంతో విజయ్ రష్మిక సంగీత్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇక ఇదిలా ఉంటే రిసెప్ష‌న్ కోసం విజయ్–రష్మిక కీలక నిర్ణయం తీసుకున్నారు. రిసెప్షన్ పూర్తిగా ఇన్విటేషన్ ఆధారిత కార్యక్రమమని స్పష్టం చేశారు. ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం లేని వారు వేదిక వద్దకు రాకూడదని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అభిమానులు పెద్దఎత్తున గుమికూడే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతో చర్చించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. హోటల్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక చెకింగ్‌లు ఉండనున్నాయి. గేట్ల వద్ద ఆహ్వాన పత్రాలను పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

భద్రతే ప్రధాన కారణం

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రతేనని తెలుస్తోంది. ప్రముఖులు హాజరవుతున్నందున సెక్యూరిటీ అత్యంత కీలకం. పెద్దఎత్తున అభిమానులు చేరితే ట్రాఫిక్ సమస్యలు, అనుకోని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యగా ఈ ప్రకటన విడుదల చేశారు.

అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి

ఈ నేపథ్యంలో ‘విరోష్’ జంట అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. “మీ ప్రేమ మాకు ఎంతో విలువైనది. అయితే మీ భద్రత మాకు మరింత ముఖ్యము. ఆహ్వానం లేని వారు రిసెప్షన్ వేదిక వద్దకు రాకండి. వచ్చి ఇబ్బందులు పడొద్దు. మీ ఆశీస్సులు ఎక్కడ ఉన్నా మాకు అందుతాయి. రిసెప్షన్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు మీ సహకారం అవసరం” అని పేర్కొన్నారు.

Latest News