Samantha | సమంత ట్రైలర్ ఈవెంట్‌లో ఊహించని ఘటన.. స్టేజ్‌పైనే ప్రపోజ్ చేసిన అభిమాని
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టింది. అనారోగ్య కారణాలతో కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టింది. అనారోగ్య కారణాలతో కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా వరుస చిత్రాలను నిర్మిస్తున్న సమంత.. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.
నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ మధ్య విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్‌లో ఒక్కసారిగా షాక్..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రబృందం స్టేజ్‌పై కూర్చొని సినిమా విశేషాలు పంచుకుంటున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ అభిమాని సెక్యూరిటీని దాటి స్టేజ్‌పైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. నేరుగా సమంత వద్దకు వెళ్లిన అతను అందరి ముందే మోకాళ్లపై కూర్చుని పువ్వులు అందించాడు.
అక్కడితో ఆగకుండా “ఐ లవ్ యూ సామ్” అంటూ సమంతకు ప్రపోజ్ చేశాడు. ఈ ఘటనతో స్టేజ్‌పై ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పక్కనే కూర్చున్న రాజ్ నిడిమోరు కూడా కాసేపు ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు.
సమంత స్పందనకు ఫ్యాన్స్ ఫిదా
అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో కాసేపు సమంత కూడా ఆశ్చర్యపోయినా.. వెంటనే పరిస్థితిని చాలా కూల్‌గా హ్యాండిల్ చేసింది. అభిమాని ఇచ్చిన పువ్వులు స్వీకరించిన ఆమె.. అతనితో నవ్వుతూ మాట్లాడింది. అంతేకాకుండా అతను కోరడంతో సెల్ఫీ కూడా తీసుకుని పంపించింది.
సమంత ఇలా స్పందించడంతో అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “స్టార్ హీరోయిన్ అయినా ఎంత సింపుల్‌గా వ్యవహరించింది”, “టైటిల్ మాత్రమే కాదు.. మనసు కూడా బంగారమే” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత పక్కనే ఉన్న రాజ్ నిడిమోరు రియాక్షన్‌పై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫన్నీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించి వీడియోలను షేర్ చేస్తుండగా, మరికొందరు “రాజ్ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి” అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
‘మా ఇంటి బంగారం’తో సమంత గ్రాండ్ కమ్‌బ్యాక్?
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో లీడ్ రోల్స్‌కు దూరంగా ఉంది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మొదట ఈ సినిమాను మేలో విడుదల చేయాలని భావించినా, తరువాత షెడ్యూల్ మార్పుల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సమంత ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram