Site icon vidhaatha

పవన్‌ ఎన్నికల ప్రచారంలో అన్నయ్య చిరంజీవి

5న పిఠాపురంలో ప్రచారం

విధాత : రాజకీయాలకు, ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటు వస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం. పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ గెలుపు కాంక్షిస్తూ మే నెల 5 తేదీన మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం చేస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

అయితే దీనిపై చిరంజీవి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విశ్వంభర సినీమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నప్పటికి తమ్ముడి గెలుపు కోసం ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం కేవలం పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం మాత్రమేనని, ఇంకెక్కడా ఏ పార్టీ తరుపునా ప్రచారం చేయరన్న ప్రచారం వినిపిస్తుంది.

Exit mobile version