Nara Lokesh | మంత్రిగా నారా లోకేశ్ ప్ర‌మాణం.. ఆనందంతో వెలిగిపోయిన బ్రాహ్మ‌ణి ముఖం

Nara Lokesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా నారా లోకేశ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. స‌భా వేదికలోని వీఐపీ ప్రాంగ‌ణంలో ఆసీనులైన లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి ముఖంలో సంతోషం వెలిగిపోయింది. ఇక లోకేశ్ ప్ర‌మాణం చేస్తుండ‌గా త‌న కుమారుడు దేవాన్ష్‌ను.. నాన్న వైపు చూడాల‌ని బ్రాహ్మ‌ణి అల‌ర్ట్ చేసింది.

  • Publish Date - June 12, 2024 / 12:10 PM IST

Nara Lokesh | అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా నారా లోకేశ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. స‌భా వేదికలోని వీఐపీ ప్రాంగ‌ణంలో ఆసీనులైన లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి ముఖంలో సంతోషం వెలిగిపోయింది. ఇక లోకేశ్ ప్ర‌మాణం చేస్తుండ‌గా త‌న కుమారుడు దేవాన్ష్‌ను.. నాన్న వైపు చూడాల‌ని బ్రాహ్మ‌ణి అల‌ర్ట్ చేసింది. ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న లోకేశ్‌ను చూసి బ్రాహ్మ‌ణి చ‌ప్ప‌ట్ల‌తో అభినందించారు. త‌ల్లి భువ‌నేశ్వ‌రి కూడా భావోద్వేగానికి గుర‌య్యారు.

ఇక ప్ర‌మాణం చేసిన అనంత‌రం లోకేశ్ త‌న తండ్రి చంద్ర‌బాబు, ప్ర‌ధాని మోదీ, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, జేపీ న‌డ్డా, న‌టులు చిరంజీవి, ర‌జ‌నీకాంత్.. లోకేశ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

మంగ‌ళ‌గిరిలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన లోకేశ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో నారా లోకేశ్ చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో దిగిన నారా లోకేశ్ రికార్డు విజ‌యం సాధించారు. 39 ఏండ్ల త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాను రెప‌రెప‌లాడించాడు. చివ‌రిసారిగా 1985లో టీడీపీ అభ్య‌ర్థి కోటేశ్వ‌ర్ రావు గెలుపొందారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ టీడీపీకి విజ‌యం వ‌రించ‌లేదు. ఇన్నేండ్ల రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ జ‌య‌కేతనం ఎగుర‌వేశారు.

మంగ‌ళ‌గిరి నుంచి వైసీపీ త‌ర‌పున లావ‌ణ్య పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే గెలిచింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నారా లోకేశ్ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకుని ఉండ‌టం ఇప్పుడు ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను పెంచాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అవే గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యాయి.

Latest News