ప్రయాణికులకు అలెర్ట్‌..! విజయవాడ డివిజన్‌లో వారం పాటు ఈ రైళ్లు రద్దు..!

  • Publish Date - November 7, 2023 / 05:37 AM IST

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండంతో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ నెల 12 వరకు గుంటూరు – విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, రాజమండ్రి – విశాఖ (07466) మెము, విశాఖ – రాజమండ్రి (07467) మెము, కాకినాడ పోర్టు – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ (17268) రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.


విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717-12718), గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243), మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17219) రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 13 వరకు విశాఖ – గుంటూరు (రైలు నెం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే, విశాఖపట్నం- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220), రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244) రైలును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.

Latest News