Kaveri Travels : సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకొని స్లీపర్‌ బస్సుగా మార్చారు

కర్నూలు ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు 43 సీట్ల పర్మిషన్ తీసుకొని అక్రమంగా స్లీపర్‌గా మార్చారు. బస్సుకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ వాలిడిటీ కూడా ముగిసింది. తెలంగాణలో ఈ బస్సుపై 16 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు (రూ. 23,120) పెండింగ్‌లో ఉన్నాయి.

Kaveri Bus Accident In Kurnool

విధాత : కర్నూలులో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్‌ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చేయించుకుంది. ఆల్ట్రేషన్‌లో రాయగడ ఆర్టీవో అధికారులు సీటింగ్‌ పర్మిషన్‌ తో పాటు ఆల్ ఇండియా పర్మిట్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్‌ 43 సీట్ల సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకొని బస్సును స్లీపర్‌గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్‌ చేశారు. 2023లో ఎన్‌వోసీతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పు చేశారు. స్లీపర్‌ కోచ్‌గా అక్రమానికి తెరతీశారు.

ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 27 జనవరి 2024 నుంచి.. 9 అక్టోబర్ 2025 వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి బస్సు ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోనూ జరిమానాలున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ముగిసింది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ కూడా 2024ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ వాలిడిటీ కూడా గత ఏడాది ఏప్రిల్ 20న ముగిసింది.