విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కు కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మేడిగడ్డ భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదం అని హెచ్చరించింది. కేటగిరి 1 ప్రమాదకర డ్యామ్ గా మేడిగడ్డను ప్రకటించింది. 2025 పోస్టు మాన్సూన్ లో నిర్వహించిన తనిఖీలలో తీవ్ర లోపాలను గుర్తించినట్లుగా కేంద్రం పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజీలోని లోపాలు తక్షణం పరిష్కరించకపోతే ప్రమాదం అని హెచ్చరించింది. వెంటనే లోపాల నివారణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కేటగిరి 1 ప్రమాదక డ్యామ్ ల జాబితాలో దేశంలోని మూడింటిలో మేడిగడ్డతో పాటు యూపీలోని ఖజూరీ డ్యామ్, జార్ఖండ్ లోని బొకరో డ్యామ్ లు ఉన్నాయని పేర్కొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థపై ఒత్తిడి పెంచుతోంది. వెంటనే పనులు చేపట్టకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించింది. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తుది నోటీసులు సైతం ఇచ్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం, నిర్మాణ లోపాల వల్ల జరిగిన ఈ నష్టానికి 7వ బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలని సూచించింది. మరమ్మతుల కోసం 5 సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను జరిపించాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్మాణ సంస్థతో పాటు బాధ్యులైన ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. పునరుద్ధరణకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థ భరించాలని, ఇందుకు అంగీకరించకపోతే ప్రభుత్వం రికవరీ చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది.
ఇవి కూడా చదవండి :
Katamayya Raksha Safety Kits : ‘కాటమయ్య రక్ష’ ఎక్కడా? .. గీత కార్మికుల ఆర్తనాదం !
Kodi Rama Krishna | కోడి రామకృష్ణ చెప్పిన సినీ పాఠాలు.. ఆ హీరో సినిమాలు ఏడాదికి 23 వచ్చేవంటూ కామెంట్
