Moinabad farmhouse controversy| క్రైమ్ హౌస్.. మొయినా బాద్ ఫామ్ హౌస్ !

మొయినా బాద్ ఫామ్ హౌస్ ..ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ఫేమస్ హౌస్. రాజకీయ నాయకులు, వీఐపీల పార్టీలకు అడ్డాగానే కాకుండా నేరమయ ఘటనలకు వేదికగా నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది. మత్తు పార్టీలకు ఫామ్ హౌస్ కు వచ్చే వారికి కిక్కు సంగతి ఏమోగాని..ఓ రకంగా రాజకీయ నాయకులకు ఈ ఫామ్ హాస్ చేదు అనుభవాలను మిగులుస్తుంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో..ఇప్పుడు డ్రగ్స్ కేసుతో ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది.

విధాత : మొయినా బాద్ ఫామ్ హౌస్ ..ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ఫేమస్ హౌస్. రాజకీయ నాయకులు, వీఐపీల పార్టీలకు అడ్డాగానే కాకుండా నేరమయ ఘటనలకు వేదికగా నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది. మత్తు పార్టీలకు ఫామ్ హౌస్ కు వచ్చే వారికి కిక్కు సంగతి ఏమోగాని..ఓ రకంగా రాజకీయ నాయకులకు ఈ ఫామ్ హాస్ చేదు అనుభవాలను మిగులుస్తుంది. రాజకీయ నాయకులకు అచ్చిరాని ఫామ్ హౌస్ గా షాక్ ఇస్తుంది.

గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి వైదికైన ఇదే ఫామ్ హౌస్ లో ఇప్పుడు డ్రగ్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం సంచలనంగా మారింది.  ఏపీలోని అధికార పార్టీ టీడీపీని, తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఈ డ్రగ్ పార్టీ కేసు రాజకీయంగా ఇరకాటంలో పడేసింది.  డ్రగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలిన పుట్ట, పైలట్ లపై ఆ రెండు పార్టీలు క్రమశిక్షణలు చర్యలు చేపట్టవచ్చన్న తెలుస్తుంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ గత నాలుగేళ్లలో ఏదో ఒక వరుస వివాదాల్లో చిక్కుకుంటుండటం గమనార్హం. బయటపడినవే ఇలాంటి సంచలనాలు ఉంటే..బయటపడకుండా.. ఇంకెన్ని జరిగాయోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.  బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలలో పట్టుబడుతుండటం విచారకరం అన్న విమర్శలకు సైతం ఊతమిస్తున్నాయి.

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తో.. మారుమోగిన మెయినాబాద్ ఫామ్ హౌస్

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందన్న స్ట్రింగ్ ఆపరేషన్ ఎపిసోడ్ అప్పట్లో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపింది. 2022 అక్టోబర్ 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ఈ ఫామ్ హౌస్ అడ్డాగా నిలిచి వార్తల్లోకి ఎక్కింది. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ అప్పటి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఏకంగా ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో జరిగిన భేరసారాలకు సంబంధించిన సంభాషణలతో కూడిన ఆడియోలు, వీడియోలను హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీ సహా దేశం అంతా పంచేశారు..వినిపించేశారు. ఆ కేసు ఇప్పటిదాక తేలకపోగా..కొనుగోలు ఎపిసోడ్ లోని అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనంతర కాలం బీజేపీలోనే చేరిపోయి..ఆ వ్యవహారం అంతా బీఆర్ఎస్ నాయకత్వం ఆడించిన డ్రామాగా కుండబద్దలు కొట్టారు. బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తామని రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది.  ఈ ఫామ్‌ హౌజ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారన్న అభియోగాలతో కేసు కొనసాగుతుంది.

ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తో బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వం చేసిన హడావుడి వెనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాగి ఉండటం మరో ట్విస్టుగా నిలిచింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘట్టం కూడా బయటపడటం ఆ కేసులను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. రాజకీయాలు..నేరాలు, ఆర్థిక వ్యవహారాలు, చట్టాల దుర్వినియోగాలతో  కలగలిసిన ఆ రెండు కేసులు ఎప్పుడు తేలుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి కొనసాగుతుంది.

మరోసారి హాట్ టాపిక్‌గా పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్

ఎమ్మెల్యేల ప్రలోభాలు..కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో ముడిపడి ఉన్న మెయినా బాద్ ఫామ్ హౌస్ ఇప్పుడు డ్రగ్స్ పార్టీతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి కొనసాగుతున్న డ్రగ్స్ పార్టీపై ఈగల్‌ బృందం జరిపిన దాడుల్లో రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు మొత్తం 11మంది పట్టుబడటం కలకలం రేపింది.

పట్టుబడిన వారిలో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్‌ కుమార్‌, ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమీత్ మిశ్రా, యం.రమేష్‌, శ్రవణ్‌ కుమార్‌, విజయ్‌ కృష్ణ, కాసిక్‌ రవి, అర్జున్‌ రెడ్డి, ప్రియాంకా రెడ్డిలు ఉన్నారని చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, ఎస్పీ గిరిధర్  తెలిపారు. ప్రియాంకా రెడ్డి అనే మహిళ కాసిక్‌ రవితో కలిసి పార్టీకి వచ్చిందని చెప్పారు.

ఈగల్ టీమ్ పై  కాల్పులు

మెయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుందన్న పక్కా సమాచారంతో ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ, లోకల్‌ పోలీస్‌లు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీత్ మిశ్రా వారిని బెదిరించేందుకు రివాల్వర్ తో నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపడం మరింత సంచలనంగా మారింది. ఆ రివాల్వర్ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. అక్కడున్న పది మందికి డ్రగ్ కిట్‌ ద్వారా పరీక్ష చేయగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డ్రగ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్‌ రెడ్డి, నమీద్‌ మిశ్రా, రీతేష్‌ రెడ్డి, కౌశిక్ రవి, పుట్ట మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌ వచ్చిందని డీసీసీ యోగేష్ గౌతమ్, ఎస్పీ గిరిధర్ రెడ్డి తెలిపారు. మరింత నిర్ధారణ కోసం రక్తనమూనాలను ల్యాబ్ కు పంపించామన్నారు.

ఈ దాడిలో 2 గ్రాముల డ్రగ్ పౌడర్‌ను సీజ్‌ చేశామని.. పరీక్షించిన తరువాత అది ఏ రకమైన డ్రగ్ అన్నది తెలుస్తుందన్నారు. 55 దేశీ, విదేశీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసున్నామని తెలిపారు. డ్రగ్ పాజిటివ్‌ వచ్చిన వాళ్లు వారం కింద సిమ్లా నుంచి వచ్చాం అని, గోవా నుంచి వచ్చాం అని..అక్కడే మత్తు పదార్ధాలను సేవించినట్లుగా చెబుతున్నారని వెల్లడించారు. నిందితుల రక్త నమూనాలను పరీక్షల కోసం ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపిస్తామని రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.  కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడని వెల్లడించారు. నిందితులు అందరిని మెయినాబాద్ ఫామ్ హౌస్ కు తరలించామని, బీఎన్ఎస్ 109తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 22, ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెడుతామని ఎస్పీ గిరిధర్ తెలిపారు.

Latest News