Moinabad Farmhouse Drugs Case | డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో పట్టుబడిన 11మంది నిందితులలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మలకు ఉప్పర్‌పల్లి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన 8మంది నిందితులను స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

Moinabad Farmhouse Drugs Case | డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్

విధాత, హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో పట్టుబడిన 11మంది నిందితులలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మలకు ఉప్పర్‌పల్లి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన 8మంది నిందితులను స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన వ్యాపారులు మొరవినేని రమేశ్‌, వరమాచినేని శ్రవణ్‌కుమార్‌, అమీర్‌పేటకు చెందిన నల్లపనేని విజయకృష్ణ , బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్‌ రవి , పుప్పాలగూడకు చెందిన తిరువీధుల అర్జున్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కన్యాలాల్‌బాగ్‌కు చెందిన సిలివేరు శరత్‌కుమార్‌, ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఆర్‌.ప్రియాంకారెడ్డిలు ఉన్నారు.

మొయినాబాద్‌ ఠాణాలో 11 మందిపై కేసు నమోదవ్వగా రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడు ఏ1 గా పేర్కొన్నారు.అలాగే లైసెన్స్‌డ్‌ తుపాకీ దుర్వినియోగం చేసినందుకు రితేశ్ రెడ్డిపైన, కాల్చినందుకు నమిత్‌పై వివిధ సెక్షన్లు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేశ్, మిగిలిన ఏడుగురికి నోటీసులిచ్చి పంపారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని 8సి, 22ఎ, 27, 29 సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని సెక్షన్‌ 30, 25(1బి)(ఎ), తెలంగాణ ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొకైన్, జర్మన్‌ మేడ్‌ తుపాకీ, 4 ఖాళీ క్యాట్‌రిడ్జ్‌లు, ఒక లైవ్‌ క్యాట్‌రిడ్జ్, 48 బీర్లు, ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల కస్టడీ కోసం పోలీసుల పిటిషన్

డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి సహా రితేష్ రెడ్డి, నమిత్ శర్మల వారం రోజుల కస్టడీ కోరుతూ మెయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరుగనుంది. మెయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు..పోలీసులపై కాల్పులు ఎందుకు జరిపారు..రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ నమిత్ శర్మ చేతికి ఎలా వచ్చిందన్న అంశాలతో పాటు కేసులోని అన్ని కోణాలపై విచారణ జరిపేందుకు పోలీసులు నిందితుల కస్డడీ కోరారు.

ఇవి కూడా చదవండి :

Faria Abdullah | సమ్మర్ హీట్ పెంచేసిన ఫరియా.. చిట్టిలో బోల్డ్ యాంగిల్‌.. అందాల అరాచ‌కం
Oscar Awards 2026 | 98వ ఆస్కార్ అవార్డులు .. ఉత్త‌మ న‌టుడిగా మైఖేల్‌ బి జోర్డన్‌, ఉత్తమ నటి జెస్సీ బుక్లే