Gold Silver Price Today | మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు వరుస తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,59,170వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,79,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 16, 2026, 12:13 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Today | మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు వరుస తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,59,170వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.1,45,900వద్ద నిలిచింది. అటు వెండి ధర సైతం మరోసారి స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,79,900వద్ద కొనసాగుతుంది.

ఇరాన్ యుద్దంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితులు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గుదలను నమోదు చేస్తుంది. ముఖ్యంగా బంగారం అనూహ్యంగా వరుస తగ్గుదలను నమోదు చేస్తుంది. సోమవారం ఉదయం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,000 డాలర్లకు పడిపోయింది. అస్థిరంగా ఉన్న చమురు ధరలు, బలపడుతున్న డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ వంటి కారణాలతో ఇప్పటికే బంగారం ధరలు వరుసగా రెండు వారాలుగా తగ్గుతూ వస్తున్నాయి.

దీంతో ద్రవ్యోల్బణం భయాలు పెరిగి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు సన్నగిల్లుతున్నాయి.. ఇక స్పాట్ వెండి ధర అయితే 1.3% కంటే ఎక్కువగా పతనమైంది. ప్రస్తుతం ఔన్సుకు 80డాలర్ల డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది.

ఇవి కూడా చదవండి :

Telangana Thalli, Potti Sriramulu statue| ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ