Oscar Awards 2026 | 98వ ఆస్కార్ అవార్డులు .. ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డన్, ఉత్తమ నటి జెస్సీ బుక్లే
Oscar Awards 2026 | హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో కొన్ని క్రేజీ సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మరియు ‘సిన్నర్స్’ సినిమాలు అవార్డుల వేదికపై దూసుకుపోయాయి.
Oscar Awards 2026 | హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో కొన్ని క్రేజీ సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మరియు ‘సిన్నర్స్’ సినిమాలు అవార్డుల వేదికపై దూసుకుపోయాయి. అయితే ఈసారి భారతీయ చిత్రాలకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం అత్యధికంగా ఆరు అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ‘సిన్నర్స్’ చిత్రం ఐదు అవార్డులు గెలుచుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఉత్తమ నటుడిగా ప్రముఖ నటుడు మైఖేల్ బీ జోర్డాన్ నిలిచారు. ఆయన నటించిన ‘సిన్నర్స్’ చిత్రానికి గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఆమె నటించిన ‘హమ్నెట్’ చిత్రానికి ఈ గౌరవం లభించింది. ఇక ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ అండర్సన్ నిలిచారు. ఆయన తెరకెక్కించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది. ఇదే సినిమా ఉత్తమ చిత్రంగా కూడా ఎంపిక కావడం విశేషం.
98వ ఆస్కార్ అవార్డుల ముఖ్య విజేతలు
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ నటుడు: మైఖేల్ బీ జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్)
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: ఈన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)
ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్ సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)
ఉత్తమ సౌండ్: ఎఫ్ 1
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ – ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డెమన్ హంటర్స్)
ఇతర ముఖ్య విభాగాల విజేతలు
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టీన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టీన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరెల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాప్ డెమన్ హంటర్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
మొత్తంగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు హాలీవుడ్‌లోని కొత్త కథలు, వినూత్న సినిమాలకు పెద్ద పీట వేశాయి. ముఖ్యంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మరియు ‘సిన్నర్స్’ సినిమాలు అవార్డుల వేదికపై సత్తా చాటడంతో సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram