Maoinabad Farmhouse Drugs Case : ఫామ్ హౌస్ కేసు.. ముగ్గురు నిందితుల కస్టడీ పొడింపు
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు మరో మూడు రోజుల కస్టడీ మంజూరు చేసింది కోర్టు. సిట్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
విధాత, హైదరాబాద్ : మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిశ్ శర్మలను మరో మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. తొలుత అనుమతించిన మూడు రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో నిందితులను సిట్ పోలీసులు గురువారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారి కస్టడీ గడువు మరో 5రోజులు పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. ముగ్గురు నిందితులు ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను మరో మూడు రోజుల కస్టడీ విచారణకు అనుమతించింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి మిత్రుడైన డాక్టర్ బాలాజీని విచారించిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసిన రాకేశ్‌శర్మ, అభిషేక్ సింగ్, మరో ఇద్దరు పెడ్లర్ల కోసం గాలిస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ, ఏలూరు టీడీపీ ఎంపి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్‌కుమార్, డ్రైవర్ శరత్ కుమార్, బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, విజయ్ కృష్ణ, ఎం. రమేశ్, ప్రియాంక రెడ్డిలతో పాటు కొత్తగా డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, సఫ్లయర్ అభిషేక్ సింగ్, డాక్టర్ బాలాజీ సహా మరొకరిని నిందితులుగా చేర్చడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్ రావు
Padi Kaushik Reddy| బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram