Moinabad Drugs Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక మలుపు
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. నిందితుల సంఖ్య 15కి చేరగా, రోహిత్ రెడ్డికి రిమాండ్ పొడిగించారు.
విధాత, హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సోదరుడు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మల మూడు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో నిందితులను వైద్య పరీక్షల అనంతరం శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు నిందితుల కస్టడీని పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. నిందితులకు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు..కస్టడీ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
విచారణతో పెరిగిన నిందితుల సంఖ్య
మొయినబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, సోదరుడు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మల మూడు రోజుల కస్టడీ విచారణ అనంతరం ఈ కేసులో అదనంగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు చేరింది. అంతకుముందు ఈ కేసులో 11మందిని నిందితులుగా పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ, ఏలూరు టీడీపీ ఎంపి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్‌కుమార్, డ్రైవర్ శరత్ కుమార్, బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, విజయ్ కృష్ణ, ఎం. రమేశ్, ప్రియాంక రెడ్డిలను గతంలో నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్తగా వారితో పాటు డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, సఫ్లయర్ అభిషేక్ సింగ్,డాక్టర్ బాలాజీ సహా మరొకరిని నిందితులుగా చేర్చారు. జూబ్లీహిల్స్ కు చెందిన డాక్టర్ బాలాజీఇంట్లో అనేకసార్లు డ్రగ్ పార్టీలు జరిగాయని కస్టడీలోని నిందితుల విచారణలో వెల్లడైనట్లగా సిట్ అధికారుల వెల్లడించారు.
రోహిత్ రెడ్డికి ఐదేళ్లుగా డ్రగ్స్ అలవాటు ఉందని, స్నేహితుడు డా. బాలాజీతో కలిసి అనేకసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నారని సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. దీంతో బాలాజీని నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీలో డ్రగ్ పార్టీ నిర్వహణ, పోలీసులపైకి కాల్పులు, డ్రగ్ నెట్ వర్క్ ఆర్థిక సంబంధాలపై ఆరా తీసిన సిట్ అధికారులు తెలిపారు. అభిషేక్ సింగ్ అరెస్టుపై మాత్రం ఇప్పటిదాక సిట్ అధికారిక ప్రకటన వెలువరించకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్.. చెప్పుతో మెడికో సమాధానం
Bangladesh Bus Accident | బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..23మంది గల్లంతు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram