ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్.. చెప్పుతో మెడికో సమాధానం
కర్ణాటకలో ప్రొఫెసర్ విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేయడంతో వివాదం చెలరేగింది. విద్యార్థిని చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విధాత : విద్యా బుద్దులు నేర్పించే గురువుగా తన నడవడికతో విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి తరగతి గదిలోనే విద్యార్ధినికి లవ్ ప్రపోజల్ చేసి చెప్పు దెబ్బలు తిన్న ఘటన వైరల్ గా మారింది. కర్ణాటకలోని నీలమంగళ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. 50 ఏళ్ల ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్లా 19 ఏళ్ల విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేశాడు.
తరగతి గదిలో అకస్మాత్తుగా ప్రొఫెసర్ విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. విద్యార్థినే తనకు మొదట లవ్ ప్రతిపాదించిందని ఆరోపిస్తూ..అందుకే తాను కూడా ప్రతిపాదిస్తున్నానంటూ చెప్పి క్లాస్ రూమ్ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోనే ప్రొఫెసర్ ను నిలదీశారు. ప్రొఫెసర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై దాడికి దిగారు. బాధిత విద్యార్థిని ఏకంగా చెప్పుతో ప్రొఫెసర్ ను కొట్టింది. పాఠాలు చెప్పడం మాని తనకే ప్రేమ పాఠాలు నేర్పాలని ప్రయత్నించిన ప్రొఫెసర్ కు ధైర్యంగా గుణపాఠం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్యను పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: సీఎం రేవంత్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram