Pilot Rohith Reddy : వాట్ నెక్ట్స్ …. షోకాజ్ నోటీసులపై రోహిత్ రెడ్డి నో ఆన్సర్ !

డ్రగ్ కేసులో అరెస్టైన రోహిత్ రెడ్డి షోకాజ్ నోటీసులకు గడువు ముగిసినా స్పందించలేదు. దీనిపై బీఆర్ఎస్‌లో అంతర్మథనం కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 28, 2026, 3:00 pm IST
Read Time: 3 mins
Pilot Rohith Reddy : వాట్ నెక్ట్స్ …. షోకాజ్ నోటీసులపై రోహిత్ రెడ్డి నో ఆన్సర్ !

విధాత, హైదరాబాద్ : మెయినాబాద్ డ్రగ్ పార్టీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనకు పార్టీ ఆధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై గడువు ముగిసినా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. డ్రగ్ కేసులో అరెస్టయిన రోహిత్ వ్యవహారంతో పార్టీ ఇమేజ్ కు డామేజ్ ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య బీఆర్ఎస్ హైకమాండ్ మార్చి 17న ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే
10 రోజులు పూర్తైనా నోటీసులపై పార్టీకి రోహిత్ రెడ్డి వివరణ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ అంతర్మధనంలో పడిపోయింది.

రోహిత్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. జైలులో ఉన్నందునే పార్టీ షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వలేకపోయారన్న రోహిత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే రోహిత్ రెడ్డి తీరుపై అసహనంతో ఉన్న పార్టీలోని మరికొందరు నేతలు మాత్రం ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రోహిత్ రెడ్డిపై వేటు వేయాలని ఆ నేతలు పార్టీ హైకమాండ్ కు సూచించినట్లుగా తెలుస్తుంది. రోహిత్ రెడ్డి వ్యవహారంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రోహిత్ రెడ్డి డ్రగ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతు మరింతగా బలపడుతుండటంతో ఆయనపై పార్టీ హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఎల్పీజీ గుడ్ న్యూస్.. గుజరాత్‌ పోర్ట్‌కు చేరుకున్న జగ్ వసంత్ ట్యాంకర్
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో