Pilot Rohith Reddy : పైలట్ రోహిత్ రెడ్డికి మరోషాక్.. మెయినాబాద్ ఫామ్ హౌస్ సీజ్
మోయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి మరో షాక్. అసైన్ భూమిపై నిర్మించిన ఫామ్ హౌస్ సీజ్, డ్రగ్స్ రాకెట్ పై సిట్ దర్యాప్తు వేగం.
విధాత, హైదరాబాద్ : మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రోహిత్ రెడ్డికి మరో షాక్ ఎదురైంది. ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న పైలట్ రోహత్ రెడ్డికి రెవెన్యూ శాఖ మరో షాక్ ఇచ్చింది. అసెన్డ్ భూమిని ఆక్రమించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కట్టారని తేల్చిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ ను సీజ్ చేశారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని సర్వే నంబర్ 117/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో అంతంగారి జంగయ్యకు అసైన్ చేసింది. ఇందులోని 2 ఎకరాలను రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి 2006లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కొనుగోలు చేయగా, మిగతా 1.29 ఎకరాల భూమిని గుల్ల రాములు, సంఘం అంజయ్య, కొడెపాక లక్ష్మణ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా అప్పటి అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
ప్రస్తుతం భూభారతి పోర్టల్, 22ఏ రిజిస్టర్లోనూ ఈ భూమి జంగయ్య పేరు మీద అసైన్డ్ ల్యాండ్‌గానే నమోదై ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు విచారించారు. దీంతో అసెన్డ్ భూమిలో నిర్మించిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు.
అనుమతులు లేకుండానే నిర్మాణం..పార్టీల నిర్వహణ
పైలట్ రోహిత్ రెడ్డి అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు నాలా కన్వర్షన్ చేయకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మించినట్లుగా కూడా తేలింది. పైగా పోలీసుల అనుమతులు లేకుండానే పార్టీలను నిర్వహిస్తుండటంతో పాటు పర్మిషన్లు లేని పార్టీలలో నిషేధిత మందు, డ్రగ్స్ పార్టీలు నిర్వహించడంపై డ్రగ్ కేసు విచారణ చేస్తున్న సిట్ వివారాలు సేకరిస్తుంది.
డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ సింగ్ అరెస్ట్
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవారని వెల్లడైంది. అభిషేక్ సింగ్ ను అరెస్టు చేసి విచారిస్తుంది. అతని సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. రోహిత్ రెడ్డికి 24 సార్లు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేశాడని గుర్తించిన సిట్ , అభిషేక్ నుంచి డ్రగ్స్ ఇంకా ఎవరెవరు కొనుగోలు చేశారన్న సమాచారాన్ని సైతం సేకరించే పనిలో నిమగ్నమైంది. సిట్ చీఫ్ యోగేష్ గౌతమ్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు డ్రగ్స్ కేసు పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అభిషేక్ సింగ్ విచారణలో డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది..పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టడం ద్వారా డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఎల్లుండి కస్టడీ పిటిషన్ పై తీర్పు
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ సహా 11 మందిని అరెస్ట్ సంగతి తెలిసిందే. వారిలో స్టేషన్ బెయిల్ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, శరత్‌కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్‌కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ సహా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు రితేశ్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు. వారి కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.
ఇవి కూడా చదవండి :
Bala Krishna | 11 రోజులు అన్నం మానేసిన బాలయ్య … ‘భైరవ ద్వీపం’ కోసం ఇంత త్యాగం చేశాడా..!
తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram