Bala Krishna | 11 రోజులు అన్నం మానేసిన బాలయ్య … ‘భైరవ ద్వీపం’ కోసం ఇంత త్యాగం చేశాడా..!

Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాస‌రావు ఒకరు. ఆయన తెరకెక్కించిన జానపద ఫాంటసీ చిత్రం ‘భైరవ ద్వీపం’ ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచింది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 21, 2026 1:26 PM IST
Bala Krishna | 11 రోజులు అన్నం మానేసిన బాలయ్య … ‘భైరవ ద్వీపం’ కోసం ఇంత త్యాగం చేశాడా..!

Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాస‌రావు ఒకరు. ఆయన తెరకెక్కించిన జానపద ఫాంటసీ చిత్రం ‘భైరవ ద్వీపం’ ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన త్యాగం గురించి తాజాగా మరోసారి చర్చ మొదలైంది.

కురూపి పాత్రలో బాలయ్య సాహసం

‘భైరవ ద్వీపం’ సినిమాలో బాలకృష్ణ ఒక కురూపి పాత్రలో నటించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న బాలయ్య, తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇలా డిఫరెంట్ పాత్రలో నటించడానికి వెంటనే ఒప్పుకోవడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనం. దర్శకుడు ముందుగా ఈ పాత్ర గురించి చెప్పినప్పుడే ఎలాంటి సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

మేకప్ కోసం గంటల సమయం… భోజనానికి బ్రేక్ లేదు

ఈ సినిమాలో కురూపి గెటప్ కోసం రోజూ దాదాపు రెండు గంటలు మేకప్ వేయడానికి, మరో రెండు గంటలు తీసేయడానికి పట్టేదట. షూటింగ్ సమయంలో మధ్యలో మేకప్ తీసేయడం సాధ్యం కాకపోవడంతో, భోజనం చేయడానికి కూడా బ్రేక్ తీసుకోలేకపోయారు బాలయ్య. దీంతో ఆయన భోజనం పూర్తిగా మానేసి, కేవలం జ్యూస్‌పైనే ఆధారపడ్డారు.

11 రోజులు ఆహారం లేకుండా షూటింగ్

దాదాపు 11 రోజుల పాటు అన్నం తినకుండా కేవలం ద్రవాహారంతోనే షూటింగ్ కొనసాగించడం నిజంగా ఆశ్చర్యకరం. పాత్రకు న్యాయం చేయాలనే పట్టుదలతో బాలకృష్ణ ఇలా చేసిన త్యాగం ఆయన కమిట్‌మెంట్‌ను స్పష్టంగా చూపిస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలయ్యకు గాయాలు కూడా అయ్యాయి. ముఖ్యంగా నీటిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ముళ్లు, రాళ్లు కాలిలో గుచ్చుకున్నా కూడా ఆయన షూటింగ్ ఆపకుండా పూర్తి చేశారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నటీనటుల అద్భుత నటన

ఈ సినిమాలో హీరోయిన్‌గా రోజానటించగా, ప్రత్యేక పాత్రలో రంభ‌ కనిపించారు. అలాగే బాలయ్య తల్లి పాత్రలో కేఆర్ విజ‌య‌ కూడా కురూపి గెటప్‌లో నటించడం విశేషం. హీరోనే అలా కనిపిస్తుంటే తానెందుకు అలా క‌నిపించ‌కూడ‌దు అంటూ ఆమె కూడా ఈ పాత్రను అంగీకరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

రిలీజ్ సమయంలో ‘భైరవ ద్వీపం’ థియేటర్లలో భారీ విజయం సాధించింది. పాటలు, కథ, విజువల్స్ అన్నీ కూడా ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పటికీ ఈ తరహా జానపద ఫాంటసీ సినిమాలు అరుదుగా వస్తున్నాయని సినీ అభిమానులు భావిస్తున్నారు.