తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ !
తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహం, హైదరాబాద్‌లో భారీ సభకు సిద్ధం.
విధాత, హైదరాబాద్ : ప్రధాన నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న 10-15రోజుల మధ్య ఏదో ఒకరోజు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని..తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో తెలంగాణకు రానున్నారని పార్టీ వర్గాల సమాచారం. బీబీనగర్ ఏయిమ్స్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోదీ ఈ సందర్బంగా శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తుంది. ప్రధాని పర్యటలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల కథనం.
గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పోరేషన్ల ఎన్నికలలో పార్టీ బలోపేతం లక్ష్యంగా సాగనున్నట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో జీహెచ్ ఎంసీని మూడు భాగాలుగా చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీని పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం 300 డివిజన్లకు విస్తరించి మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా ఏర్పాటు చేసింది. ఇదివరకు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లను పునర్విభజించడంతో 243కు పెరిగాయి. దీనికి తోడు విలీన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలన వ్యవస్థ ఏర్పడింది. జీహెచ్‌ఎంసీగా ఉన్న ఓఆర్ఆర్ పరిధి మూడు కార్పొరేషన్లుగా మారిపోయింది. ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు కూడా పూర్తవ్వడంతో మూడు కార్పోరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది.
మూడింట పాగాకు కమల దళం కసరత్తు
ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి జోన్లతో జీహెచ్ఎంసీ రూపుదిద్దుకుంది.కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఏర్పాటైంది. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఏర్పాటైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టే లక్ష్యంతో ఎంఐఎం వ్యూహం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేసిందని బీజేపీ భావిస్తుంది. కాంగ్రెస్, ఎంఐఎం రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టి మూడు కార్పోరేషన్లలో కాషాయ జెండా ఎగరేయాలని కమల దళం భావిస్తుంది. ఇందుకు ప్రధాని మోదీ పర్యటనను ఆసరగా చేసుకుని పట్టణ ప్రాంత ఓటర్లలో మరింత బలాన్ని పెంచుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుండటం ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి :
Aggipetti macha | సోషల్ మీడియా స్టార్ ‘అగ్గిపెట్టె మచ్చా’ గల్లంతా?… కుటుంబ ఆవేదనతో పెరిగిన ఆందోళన
India LPG ships| భారత్ కు మరో రెండు ఎల్పీజీ నౌకల రాక!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram