విధాత : సాహస క్రీడలు చేసేటప్పుడు ప్రమాదాల నివారణకు సేఫ్టీ మెథడ్స్ పాటించకపోతే ప్రాణాలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే పర్వతాలను ఎక్కుతూ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా పేరొందిన అల్-ఖాఖా స్టంట్లు చేసే క్రమంలో పట్టు తప్పి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలైన ఘటనే ఇందుకు నిదర్శనం.ఈ ఘటన మరుసటి రోజునే
రోప్ జంపింగ్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం బలిగొంది.

బ్రెజిల్‌లోని లిమేరలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోంటే డోస్కోలేటో ట్రైల్ వద్ద రోప్ జంపింగ్ చేస్తున్న సమయంలో ఎడ్వర్డా రోడ్రిడ్జ్‌ (21) అనే యువతి దురదృష్టవశాత్తు మరణించింది. రోడ్రిడ్జ్‌ ను జంపింగ్ కు సిద్దం చేసే సమయంలో ఇన్‌స్ట్రక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి సెఫ్టీ రోప్(తాడు) కట్టడాన్ని మరిచిపోయారు. సిబ్బంది ఆమెను జంపింగ్ కోసం కిందకు వదిలివేయడగానే..సుమారు 40 మీటర్ల ఎత్తు నుండి కిందకు పడి రోడ్రిడ్జ్‌ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి జంపింగ్ కోసం వచ్చిన సమయంలో అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వారు ఆమెకు సేఫ్టీ తాడు కట్టకుండానే పైనుంచి తోసేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు ఆర్గనైజర్లు భయంతో అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు గాలింపు జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.