అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్..వినూత్న శిక్ష

హైదరాబాద్ చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై ఓ యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా, అసభ్యంగా ఆటో నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న యువతకు గుణపాఠం చెప్పేలా ఆకతాయి మైనర్ ఆటో డ్రైవర్ కు వినూత్న శిక్ష విధించారు.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Jul 24, 2026, 12:32 pm IST
Read Time: 3 mins
అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్..వినూత్న శిక్ష

అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న యువతకు గుణపాఠం చెప్పేలా ఓ ఆకతాయి ఆటో డ్రైవర్ కు వినూత్న శిక్ష విధించారు. హైదరాబాద్ చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై ఓ యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా, అసభ్యంగా ఆటో నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించి సదరు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు.

ఆటో డ్రైవర్ మైనర్ అని తేలడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. జువైనల్ బోర్డు ఆకతాయి మైనర్‌కు వినూత్న శిక్ష విధించింది. నెల రోజుల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్ సేవలు అందించాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ లో నమోదైన ఈ కేసులో తాజాగా జువైనల్ బోర్డు తీర్పు వెలువరించింది.ఈ శిక్ష ద్వారా బాలుడిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడమే లక్ష్యంగా బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.