కెరటాలతో పోరాటం..బాలుడిని కాపాడిన లైఫ్ గార్డ్

ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలకు ఎదురెళ్లి సముద్రంలో మునిగిపోతున్న ఓ బాలుడిని లైఫ్ గార్డ్ కాపాడిన వీడియో వైరల్ గా మారింది. బాలుడిని కాపాడే క్రమంలో వారికి సహాయం చేసేందుకు వచ్చిన మరికొందరు అలల తీవ్రతను తట్టుకోలేక వెనక్కి తగ్గినప్పటికి, ఆ లైఫ్‌గార్డ్ మాత్రం భయపడి వెనుదిరగకుండా అత్యంత ధైర్య సాహసాలతో బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకరావడం విశేషం.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Jul 29, 2026, 9:26 am IST
Read Time: 4 mins
కెరటాలతో పోరాటం..బాలుడిని కాపాడిన లైఫ్ గార్డ్

ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలకు ఎదురెళ్లి సముద్రంలో మునిగిపోతున్న ఓ బాలుడిని లైఫ్ గార్డ్ కాపాడిన వీడియో వైరల్ గా మారింది. కాలిఫోర్నియాలోని సైప్రస్ బీచ్‌లో ఫొటోగ్రాఫర్ స్కాట్ ఫొటోలు తీస్తుండగా, సముద్రపు భారీ అలల ఉదృతికి ఓ బాలుడు కనిపించి మాయమవుతుండటాన్ని గమనించి వెంటనే లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించారు. సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న ఆ పదేళ్ల బాలుడు ఒక్కసారిగా విరుచుకపడిన కెరటాల మధ్య ప్రమాదంలో చిక్కుకున్నాడు. లైఫ్‌గార్డ్ వెంటనే సముద్రంలోకి దిగి బాలుడిని గట్టిగా పట్టుకుని అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి రాకాసి అలలను ఎదుర్కొంటూ క్షేమంగా తీరానికి చేర్చాడు.

బాలుడిని కాపాడే క్రమంలో వారికి సహాయం చేసేందుకు వచ్చిన మరికొందరు అలల తీవ్రతను తట్టుకోలేక వెనక్కి తగ్గినప్పటికి, ఆ లైఫ్‌గార్డ్ మాత్రం భయపడి వెనుదిరగకుండా బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. విశేషం ఏమిటంటే, ఆ లైఫ్‌గార్డ్‌కు ఇదే తొలి రెస్క్యూ ఆపరేషన్ అయినప్పటికీ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి బాలుడి ప్రాణాలను కాపాడాడటం అందరి ప్రశంసలను అందుకుంది. సుదూర పసిఫిక్ హరికేన్ నుండి వచ్చిన భారీ అలల మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం విశేషం.

లైఫ్ గార్డుకు వైట్ హౌస్ అత్యున్నత పౌర పురస్కారం: ట్రంప్

సముద్రంలో మునిగిపోతున్న బాలుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన 16ఏళ్ల లైఫ్ గార్డుకు అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు కొడుకు డోనాల్డ్ ఎరిక్ చేసిన సూచనకు ట్రంప్ సానుకూలంగా స్పందించారు. రియల్ హీరో లైఫ్ గార్డును , అతని కుటుంబాన్ని వైట్ హౌస్ కు ఆహ్వానిస్తానని, అక్కడ ఆ కుర్రాడికి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తానని , ఈ అవార్డు అందుకోవడానికి అతడు అర్హుడని ట్రంప్ అభినందించారు.