పైపైకి బంగారం ధరలు

గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగి రూ. 1,44,330 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 1,32,300వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద నిలకడగా కొననసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 30, 2026, 10:17 am IST
Read Time: 2 mins
పైపైకి బంగారం ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగి రూ. 1,44,330 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 1,32,300వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద నిలకడగా కొననసాగుతుంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ద్రవ్య విధానాల కదలికల నడుమ బంగారం ధరలు తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. స్థిరంగా బలపడుతున్న అమెరికన్ డాలర్, ఫెడరల్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, పసిడి సరఫరా వంటి పరిస్థితులు, ఇన్వెస్టర్ల నిర్ణయాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరికొన్ని రోజులు బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మార్కెట్ ను గమనిస్తూ..అవసరమైన వారు కొద్దికొద్దిగా బంగారం కొనుగోలు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.