దైవలీలలు చిత్ర విచిత్ర ఘటనలతో మనుషులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. విగ్రహాలు, దేవుని పటాలు పాలు తాగడం వంటి ఘటనలు తరచూ ఎక్కడోచోట వెలుగుచూస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటాయి. అలాంటి విచిత్ర ఘటనలను భక్తులు దైవ మహిమగా భావిస్తే…విజ్ఞాన వేత్తలు మాత్రం వాటి వెనుక శాస్త్రీయ కోణాలు వెల్లడిస్తుంటారు.
తాజాగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఒక విచిత్రమైన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయంలో శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల రంగులోకి మారుతుండటంతో భక్తులను అశ్చర్య, ఆనందాలకు గురి చేస్తుంది. అదంతా శివయ్య లీలగా భావించిన భక్తులు భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భక్తుల పోలో మంటూ శివాలయానికి క్యూ కట్టారు. అయితే నూనెలోని రసాయన చర్య వల్లే అలా రంగు మారుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆలయ అర్చకులు రాజేష్ స్వామి వివరాల మేరకు గత మే నెలలో గఆలయ పునర్ నిర్మాణం చేపట్టిన స్థానికులు కుంభాభిషేకం నిర్వహించారు. గత 10 రోజులు గా శివాలయంలో రుద్ర పఠనం కూడా జరుగుతుంది. ఈ నేపధ్యం అర్చకుడు రాజేష్ స్వామి శివలింగానికి నువ్వుల నూనె తో అభిషేకం చేస్తుండగా పాలుగా మారుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేసింది.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో అభిషేకం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివలింగంపై నూనెతో అభిషేకం చేయగానే అది పాల రంగులోకి మారుతున్న దృశ్యాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు… pic.twitter.com/DIHtZ8k1Ew
— RTV (@RTVnewsnetwork) July 21, 2026