కోబ్రా మాంసానికి అక్కడ చాల డిమాండ్!

కోబ్రాలు, ఇతర పాముల మాంసానికి ఆ దేశంలో చాల గిరాకీ నెలకొంది. ప్రపంచంలోని అధిక శాతం దేశాలలో పాము మాంసం, రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం అరుదు. అయితే ఇండినేషియాలో మాత్రం పాము మాంసం, రక్తానికి చాల డిమాండ్ ఉంది.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Jul 22, 2026, 11:42 am IST
Read Time: 4 mins
కోబ్రా మాంసానికి అక్కడ చాల డిమాండ్!

కోబ్రాలు, ఇతర పాముల మాంసానికి ఆ దేశంలో చాల గిరాకీ నెలకొంది. ప్రపంచంలోని అధిక శాతం దేశాలలో పాము మాంసం, రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం అరుదు. అయితే ఇండినేషియాలో మాత్రం పాము మాంసం, రక్తానికి చాల డిమాండ్ ఉంది. మన దగ్గర రోడ్డు పక్కన ఛాట్ భండార్, టిఫిన్ సెంటర్ల మాదిరగా ఆ దేశంలో పాము మాంసాంతో కూడిన వంటకాలు విరివిగా విక్రయిస్తుంటారు.

తాజాగా ఓ వీడియోలో ఇండోనేషియాలోని ఒక వీధి దుకాణం వద్ద ఒక మహిళ కొక్కెంతో బోనులోంచి సజీవ నాగుపాములను బయటకు లాగడం, మెలికలు తిరుగుతున్న ఇతర పాముల మధ్య వాటిని నరికే దిమ్మపై సిద్ధం చేయడం, అడిగిన వారికి వండి వార్చడం కనిపిస్తుంది. ఆ దుకాణం వద్ద మెరుగైన,బలమైన, రోగ నిరోధక ఆహారం ఇక్కడ మీ కోసం సిద్దం అంటూ ఓ పాము ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రచార పోస్టర్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పాములతో పాలు పలు వన్యప్రాణుల ఆహారం కూడా ఇక్కడ లభించును అని ఆ పోస్టర్ లో పేర్కొనడం ఆసక్తికరం.

ఇండోనేషియా ప్రజల ఆహార సంస్కృతిలో పాముల వంటకాలు ప్రసిద్ది. అక్కడ”కోబ్రా పకోడీ” సహా పలు రకాల పాము రక్తం వంటకాలను విక్రయిస్తుంటారు. భారత్ లో హోటల్స్,టిఫిన్ సెంటర్ల తరహాలో దుకాణం వద్దనే సిద్దంగా బాక్స్ లలో ఉండే పాములను తీసి వినియోగదారులకు వాటితో వంటలను సిద్దం చేసి సరఫరా చేస్తుంటారు. అక్కడి స్థానిక దుకాణాలలో నాగుపాము మాంసంతో చేసిన పకోడీలు, నాగుపాము రక్తం, ఎండిన పైత్యరసం, ఇంకా పాము మాంసంతో చేసిన నూడుల్స్ లాంటి ఇతర వంటకాలతో సహా పలు రకాల వంటకాలు అందిస్తుంటారు. పాము వంటకాల ధర సుమారు రూ.1,000కి అందుబాటులో ఉంటాయి. పాముల రక్తం తాగితే శారీరక బలం పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం. పాము వంటకాలకు ఔషధ గుణాలు ఉన్నాయని లేదా అవి బలాన్ని పెంచుతాయని భావిస్తారు.

పాముల వంటకాలు ఇండోనేషియా దేశ ప్రజలకు సాధారణమే అయినప్పటికి..పాములను పూజించే భారత్ వంటి దేశాల ప్రజలకు ఇది అసాధరణంగా, అపవిత్రంగా కనిపిస్తుంటుంది. పర్యావరణకారులు సైతం పాముల ను ఆహారంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తుంటారు.