Anaya Banger | లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొత్త జీవితం.. అమ్మాయిలా మారిన క్రికెట‌ర్ త‌నయుడు

Anaya Banger | భారత మాజీ క్రికెటర్ సంజ‌య్ బంగ‌ర్ కుమారుడు ఆర్యన్ బంగర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. గత కొంతకాలంగా లింగ మార్పిడి ప్రక్రియలో ఉన్న ఆయన తాజాగా థాయిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారారు.

Anaya Banger | భారత మాజీ క్రికెటర్ సంజ‌య్ బంగ‌ర్ కుమారుడు ఆర్యన్ బంగర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. గత కొంతకాలంగా లింగ మార్పిడి ప్రక్రియలో ఉన్న ఆయన తాజాగా థాయిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారారు. ఇకపై తన పేరు అనయా బంగర్‌గా మార్చుకున్నట్లు ఆమె ప్రకటించారు. తన కొత్త జీవిత ప్రయాణానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి.

ఆర్యన్ నుంచి అనయాగా..

ఆర్యన్ బంగర్ గతంలోనే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా థాయిలాండ్‌లో ‘వాజినోప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఈ మార్పు పూర్తయింది. ఈ ప్రక్రియ అనంతరం తన పేరు అనయా బంగర్‌గా మార్చుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ఇంగ్లాండ్‌లో ఈ చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి భారత్‌కు రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిత్వాన్ని అంగీకరించుకునే ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను వివరిస్తూ ఆమె పంచుకున్న వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

క్రికెట్ నుంచి కొత్త జీవితానికి..

లింగ మార్పిడి ప్రక్రియకు ముందు అనయా ఒక ప్రతిభావంతమైన క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఆర్యన్ బంగర్‌గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్లబ్ తరపున క్రికెట్ ఆడింది. అంతేకాకుండా భారత స్టార్ ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్‌తో కలిసి అండర్-16 స్థాయిలో కూడా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.

క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన వ్యక్తిగత గుర్తింపును గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం మాంచెస్టర్‌లో నివసిస్తున్న అనయా తన ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా పంచుకుంటోంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు

అనయా బంగర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ కొత్త జీవితంలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వ మార్పును చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ, చాలా మంది మాత్రం “ప్రతి వ్యక్తికి తన జీవితం తన ఇష్టమనే భావనతో వారి నిర్ణయాలను గౌరవించాలి” అని అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం సమాజంలో మార్పుకు సంకేతమని కూడా కొందరు పేర్కొంటున్నారు.ఏది ఏమైన అనయా బంగర్ తన కొత్త జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి, తన ప్రయాణాన్ని ప్రపంచంతో పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

Latest News