Hardik Pandya| టీమిండియా ఆల్ రౌండర్ విడాకుల విషయం కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తూ ఉండగా, ఎట్టకేలకి దానిపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో హార్దిక్-నటాషాలకి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2018లో హార్ధిక్ పాండ్యా తన పుట్టిన రోజు ఇచ్చిన పార్టీ తర్వాత వారిద్దరు ప్రేమలో ఉన్నట్టు అందరికి క్లారిటీ వచ్చింది. అయితే 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు.ఇక లాక్‌డౌన్‌లో అంటే 2020 జూలైలో వారు ఆగస్త్య అనే చిన్నారికి జన్మనిచ్చారు. ఇక వివాహం 2023 ఫిబ్రవరి 13న చేసుకున్నారు. అయితే కొన్నాళ్లపాటు వారి సంసారం సజావుగానే సాగిన అనుకోని కారణాల వలన వారిద్దరు విడాకులు తీసుకున్నారు.
విడాకుల అనంతరం ముంబైని వదిలి సొంత దేశం సెర్బియాకి వెళ్లింది నటాషా… అక్కడ కుమారుడు అగస్త్యాతో కలిసి థీమ్ పార్క్‌కు వెళ్లింది. ఆ సమయంలో తీసిన ఫొటోని సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై హార్ధిక్ పాండ్యా స్పందించడం హాట్ టాపిక్ అయింది. సూపర్ అనే ఏమోజీతో పాటు రెడ్ హార్ట్ ఏమోజీని కూడా హార్ధిక్ పాండ్యా జత చేశాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. పాండ్యా తన మాజీ సతీమణి పట్ల అదే గౌరవం, ప్రేమ వ్యక్త పరుస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం సోషల్ మీడియా వేదికగా నటాషాని దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న కారణంగానే విడాకులు ఇచ్చిందని కొందరు కామెంట్ చేశారు. అయితే నటాషాకి కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితం వారిష్టమని, విడిపోవడం, కలిసి ఉండటం వారి వ్యక్తిగత నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఏది ఏమైన విడాకుల తర్వాత నటాషా పోస్ట్‌కి హార్ధిక్ పాండ్యా పాజిటివ్‌గా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.