Maoist Surrender | గణపతి లొంగుబాటు నేడే?

తెలంగాణలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 130 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోబోతున్నట్లుగా పోలీస్ వర్గాల సమాచారం. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోనున్నారని, వారిలో మావోయిస్టు పార్టీ మాజీ దళపతి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ) సహా పలువురు ముఖ్య నాయకులు ఉన్నారని తెలుస్తుంది.

Maoist leader Ganapathi surrender

విధాత : తెలంగాణలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 130 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోబోతున్నట్లుగా పోలీస్ వర్గాల సమాచారం. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోనున్నారని, వారిలో మావోయిస్టు పార్టీ మాజీ దళపతి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ) సహా పలువురు ముఖ్య నాయకులు ఉన్నారని తెలుస్తుంది. లొంగిపోనున్న మావోయిస్టుల నుంచి 70కిపైగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.

మావోయిస్టుల లొంగుబాటుపై సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ సందర్బంగా కూడా గణపతి లొంగుబాటుపై చర్చించినట్లుగా తెలుస్తుంది. దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి, నరసింహారెడ్డిల లొంగుబాటు సమయంలోనే గణపతితో కూడా లొంగుబాటు సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి :

Gaddar Awards 2025 | గద్దర్ పురస్కారాల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా నాగ చైత‌న్య‌, చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
Tharun bhascker | విడాకుల‌కి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ .. ఈషా రెబ్బాతో పెళ్లి నిజమేనాT?

Latest News