ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీపై చర్చలు ఊపందుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని, కొత్త కెప్టెన్ వేట మొదలైందంటూ గత కొంతకాలంగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ కూడా ఫిక్స్ అయ్యాడనే మాటలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ 37 ఏళ్ల రోహిత్ శర్మ భారత వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తప్పక రోహిత్ శర్మ (Rohit Sharma) తన భవిష్యత్తును నిర్ణయించుకోనుండగా తర్వాత భారత జట్టుకు కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించడాన్ని బీసీసీఐ పరిగణించవచ్చు.
అయితే.. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాట్లు అతనే భవిష్యత్ కెప్టెన్ అంటూ మీడియా సైతం పదేపదే వళ్లె వేస్తోంది. 25 ఏళ్ల శుభమన్ గిల్ (Shubman Gill) తన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకొంటున్నాడు. ఏ స్థానంలో నైనా ఆడే సామర్థ్యం ఉంది నాగపూర్ లో మూడో స్థానంలో కటక్‌లో ఓపినింగ్ వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతను స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు బోర్డు బావిస్తోందా ? శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మైదానంలో అతను రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ మెళకువలను గమనిస్తున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన నాగ్‌పూర్ వన్డే మ్యాచ్ గెలిచిన తర్వాత శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ, ‘మైదానంలో, రోహిత్ భయ్ ఏమనుకుంటున్నారో నేను ఎల్లప్పుడూ తెలుసుకొంటున్నా మ్యాచ్ సమయంలో నాకు ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పాలి అని రోహిత్ భయ్యా చెప్పేడు అందుకే నా అభిప్రాయలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటా అన్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో, విరాట్ కోహ్లీ లేనప్పుడు శుభ్‌మన్ గిల్ నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 87 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. కటక్ లో ఓపెనర్ గా వచ్చి కూడా హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా ఫ్యూచర్ ప్లేయర్‌గా పేరుగాంచాడు. అతను టీం ఇండియాకు ఎక్కువ కాలం కెప్టెన్సీ పాత్రను పోషించగలడనే అభిప్రాయం బోర్డుకి వస్తే అతనినే కెప్టెన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి .
ఏది ఏమైనా చాంపియన్ ట్రోఫీ రిజల్ట్ మీద రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటన మీద భారత్ ఫ్యూచర్ కెప్టెన్ ఒక క్లారిటీ మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ లో టాలెంట్‌కు కొదువలేదు కానీ దానిని సక్రమ మార్గంలో ఉపయోగించుకొంటూ రాజకీయాలు లేకుండా సరైన టాలెంట్ ఉన్న ప్లేయర్ కి అవకాశాలు/ రెస్ట్ ఇవ్వడం ప్లేయర్స్ కి నిత్యం కోచింగ్ / ప్రాక్టీస్ / దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశాలు వీటన్నీద బోర్డు దృష్టి పెడితే భారత్ క్రికెట్ ఏ ఇతర దేశానికి అందనంత ఎత్తులో ఉండగలదు.