Virosh | వైరల్ అవుతున్న విజయ్-రష్మిక పాత వీడియో.. నీతో సినిమాలు చేయను అంటూనే…

Virosh | టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న జంటల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మందాన‌ జంట ఒకటి. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో వీరికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటను టాలీవుడ్‌లోని అందమైన కపుల్స్‌లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

Virosh | టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న జంటల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మందాన‌ జంట ఒకటి. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో వీరికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటను టాలీవుడ్‌లోని అందమైన కపుల్స్‌లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే వ‌రుణ్ తేజ్, అలాగే నాగ చైత‌న్య- శోభిత‌ వంటి సెలెబ్రిటీ జంటల సరసన ఇప్పుడు విజయ్ – రష్మిక జంట కూడా చేరిపోయింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటిసారి కలిసి నటించిన సినిమా గీత గోవిందం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో పాటు ఈ జంటకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మరింత పెరిగి ప్రేమగా మారిందని అప్పట్లో టాక్ వినిపించింది.

అయితే చాలా కాలం పాటు ఈ జంట తమ ప్రేమను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచింది. కానీ ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనలు వెళ్లడం, సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు కారణంగా వారి రిలేషన్‌షిప్ గురించి అనేకసార్లు చర్చలు జరిగాయి. గత ఏడాది వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారని, కానీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా ప్రకటించలేదని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా వీరి వివాహం, రిసెప్షన్ కార్యక్రమాలు పూర్తవడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు విజయ్ – రష్మికలకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమా సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జరిగిన సరదా సంఘటన ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ రష్మికను సరదాగా ఆటపట్టించడంతో ఆమె కొంచెం సీరియస్‌గా స్పందించింది.

ఆ సమయంలో రష్మిక మాట్లాడుతూ “నీతో ఏ సినిమాలోనూ కలిసి నటించను. ఒక రోజు నువ్వే నాకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను నీతో కలిసి నటించకపోతేనే నా విలువ నీకు తెలుస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించింది. అంతేకాదు “నువ్వు ఎవరితోనైనా సినిమాలు చేయి… ఎవరితోనైనా సైన్ చేయించుకో. కానీ నేను మాత్రం నీతో ఏ సినిమాకూ సైన్ చేయను” అని కూడా నవ్వుతూ చెప్పింది.

అయితే కాలం గడిచేకొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో సినిమాలో కలిసి నటించనని చెప్పిన రష్మిక మందన్న ఇప్పుడు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామిగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు “సినిమాల్లో కాదు… జీవితంలోనే కలిసి నటిస్తున్నారు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

 

Latest News