మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం మధ్యమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమష్టి నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పదోన్నతులు అందుకుంటారు. అధికారుల ప్రోత్సాహం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా, ఆదాయం కూడా పెరగడంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో స్వల్ప ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా అవగాహనతో వ్యవహరించాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారు తమ తమ రంగాల్లో కృషికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ధనయోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఉద్యోగంలో పురోగతి ఉన్నప్పటికీ స్థిరత్వం లోపిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారులు తమ వ్యాపారంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. నిరాశ, నిస్పృహలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎంత సహనంతో ఉన్నా వాదనలు, ఘర్షణలు తప్పక పోవచ్చు. కొన్ని ఘటనలు విచారం కలిగిస్తాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. పనిగట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. వ్యాపారంలో సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాల ద్వారా లాభాలు గణనీయంగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించిన ఆందోళన విడిచిపెట్టి ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ క్రమంగా మెరుగు పడుతుంది. డబ్బుకు కొరత ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సామరస్యపూరిత వాతావరణం ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరమైన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక విషయాల్లో వివేకంతో వ్యవహరించాలి. మీ సమర్థతతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు. అధికారుల నిర్ణయాలు గౌరవించడం మంచిది. సరైన ప్రణాళికతో, బాధ్యతాయుతంగా పని చేయడం వలన వృత్తి ఉద్యోగాల్లో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పోటీ పెరగడంతో లాభాలు తగ్గుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో ఈ వారం గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనువైన సమయం. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రుణభారం, వ్యయాలు తగ్గుతాయి. పొదుపు ప్రణాళికలు పాటిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం విజయవంతంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అధికార యోగంతో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వ్యాపారాన్ని పలు ప్రాంతాలకు విస్తరిస్తారు. తెలివైన నిర్ణయాలతో మంచి లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరిగి విజయాలు సాధిస్తారు. ముందుచూపుతో అధిక ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో శాంతంగా ఉండడం వలన క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి కానుకలు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు అందుకుంటారు. వృత్తి పరంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఆదాయంలో స్పష్టమైన వృద్ధి గోచరిస్తోంది. వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ లభించవచ్చు. రుణభారం తగ్గుతుంది. మొహమాటంతో ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. డబ్బు తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఉండవచ్చు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం చక్కగా యోగిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడంతో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదవీయోగం ఉంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో మెరుగైన పురోగతి చూస్తారు. ఉద్యోగులకు మంచి సమయం. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. కీలక సమావేశాలు, చర్చల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారులకు ధనయోగం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడంతో పాటు పెట్టుబడులు కూడా పెరగడంతో గణనీయమైన లాభాలను చూస్తారు. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన రుణబాధలు తొలగుతాయి. పొదుపు ప్రణాళికలతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగంలో మెరుగైన పురోగతి కోసం తీవ్రంగా శ్రమించాలి. పనిఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ప్రయోజనాలు ఆలస్యం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయకండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. అధికారుల మెప్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఎంత కృషి చేసినా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. పోటీ పెరగడంతో లాభాలు తగ్గుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యహారాలు పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలెక్కుతాయి. కుటుంబ కలహాలు రాకుండా మీ కోపాన్ని నియంత్రించండి. పెద్దల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది.
