Allu Arjun | పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంత ప్రేమాభిమానాలు చూపుతారో మరోసారి నిరూపించారు. సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఆయన, కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో తన భార్యకు ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం బన్నీకి అలవాటే. ఈసారి తమ వివాహ బంధానికి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.
15 ఏళ్ల ప్రేమ బంధం
అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహా రెడ్డి మార్చి 6, 2011న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అలా చూసుకుంటే ఈ ఏడాది వారి వివాహ బంధానికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చాలని భావించిన అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహారెడ్డికు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఇంటికి కొత్త కారును తీసుకువచ్చి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కారు తాళాలను స్నేహా రెడ్డికి అందించారు.
ఈ సందర్భంగా బన్నీ తండ్రి అల్లు అరవింద్, కుమారుడు అయాన్, కుమారెత్త అర్హ కూడా అక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఆనందంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
బన్నీ ఎమోషనల్ పోస్ట్
యానివర్సరీ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. “హ్యాపీ యానివర్సరీ క్యూటీ. మనం కలిసి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. నువ్వు లేకపోతే నా జీవిత ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు” అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.
ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ పెళ్లి జరిగిన అదే తేదీ అయిన మార్చి 6న ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడం. అన్నదమ్ములిద్దరూ ఒకే తేదీకి పెళ్లి చేసుకోవడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకుంటే, ఒకవైపు కుటుంబంలో పెళ్లి వేడుకలు, మరోవైపు వివాహ వార్షికోత్సవం… ఇలా రెండు ఆనందకరమైన సందర్భాలు ఒకేసారి రావడంతో అల్లు కుటుంబంలో సంబరాలు మరింత రెట్టింపు అయ్యాయి.
Celebrating 15 years of love and togetherness. 🖤
A special anniversary surprise from Icon star @alluarjun for #AlluSnehaReddy garu 🤩
A wholesome moment. ✨ pic.twitter.com/nNxU7QefDd
— Team Allu Arjun (@TeamAAOfficial) March 7, 2026
