Gaddar Awards 2025 | గద్దర్ పురస్కారాల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా నాగ చైత‌న్య‌, చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు

Gaddar Awards 2025 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డులు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలను గౌరవించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అవార్డుల జాబితాలో పలువురు సినీ ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కడం విశేషం.

Gaddar Awards 2025 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డులు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలను గౌరవించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అవార్డుల జాబితాలో పలువురు సినీ ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కడం విశేషం.

ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించారు. దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఆయన అందించిన కృషిని గౌరవిస్తూ ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయనుంది. ఈ ప్రకటనతో టాలీవుడ్‌లో ఆనంద వాతావరణం నెలకొంది.

అలాగే భారతీయ సినీ రంగంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన విశ్వనటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన కలంతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారె పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డు ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి స్మారకంగా ప్రదానం చేయబడుతోంది.

ఈ అవార్డుల ఎంపికకు సంబంధించిన స్పెషల్ జ్యూరీ వివరాలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అధికారికంగా వెల్లడించారు. సినీ రంగంలో విశిష్ట కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ గద్దర్ పురస్కారాలు తెలుగు సినిమా రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినీ దిగ్గజాలకు ఇలాంటి గౌరవాలు లభించడం పరిశ్రమకు గర్వకారణమని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గద్దర్ అవార్డులు – 2025  జాబితా చూస్తే…

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
అక్కినేని నేషనల్ అవార్డు – జయసుధ
పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు – అశ్వినీదత్
జీవన రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
కాంతారావు అవార్డు – ఆర్ నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్
సినారె అవార్డు – సుద్దాల అశోక్ తేజ

ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ద్వితీయ ఉత్తమ చిత్రం – దండోరా
తృతీయ ఉత్తమ చిత్రం – ద ప్రీ వెడ్డింగ్ షో

ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక మందాన (ద గర్ల్ ఫ్రెండ్)

జాతీయ సమైక్యతా భావం పెంచే సినిమా – తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో
నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌

ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు – రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)

ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర

ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి ఛాంపియన్‌
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్‌ అఖండ
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చాంపియన్‌ – చంద్రకాంత్‌
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (చాంపియన్‌)

Latest News